వంటింట్లోకే గ్యాస్‌! ప్రతి వంటింటికీ పైప్‌ లైన్‌న్‌ద్వారా సహజ వాయువు, అందించే పనులు జిల్లాలో వడివడిగా సాగుతున్నాయి. | - | Sakshi
Sakshi News home page

వంటింట్లోకే గ్యాస్‌! ప్రతి వంటింటికీ పైప్‌ లైన్‌న్‌ద్వారా సహజ వాయువు, అందించే పనులు జిల్లాలో వడివడిగా సాగుతున్నాయి.

Sep 27 2026 2:15 PM | Updated on Sep 27 2026 2:15 PM

వంటింట్లోకే గ్యాస్‌! ప్రతి వంటింటికీ పైప్‌ లైన్‌న్‌ద్వారా సహజ వాయువు, అందించే పనులు జిల్లాలో వడివడిగా సాగుతున్నాయి. ఆదివారం శ్రీ 27 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026 8లోu

న్యూస్‌రీల్‌

అవగాహన కల్పిస్తున్నాం

కఠిన చట్టాలున్నా.. చిన్నారులపై లైంగిక నేరాలకు అడ్డుకట్ట పడడం లేదు. జిల్లాలో పోక్సో కేసులు పెరుగుతుండడం బాలల భద్రతపై ఆందోళన కలిగిస్తోంది.

వికారాబాద్‌: మైనర్లపై లైంగిక దాడులు, వేధింపులు, అసభ్యకర ప్రవర్తనకు సంబంధించిన ఘటనలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. జిల్లాలో ప్రతి రెండు మూడు రోజులకు ఓ ఘటన వెలుగుజూస్తోంది. గడిచిన వారం రోజుల్లో ఒక్క పరిగి పోలీస్‌ సర్కిల్‌లోనే మూడు పోక్సో కేసులు నమోదయ్యాయి. సగటున నెలకు పది కేసుల చొప్పున గడిచిన ఎనిమిది నెలల్లో మొత్తం 80 కేసులు నమోదయ్యాయి. ఈ దాడులకు పాల్పడుతున్న వారిలో ఉపాధ్యాయులు, పరిచయస్తులు, రక్త సంబంధీకులు, చుట్టుపక్కల వారే ఉండడం ఆందోళన కలిగించే విషయం.

డిజిటల్‌ ప్రపంచమే అధిక కారణం

ఈ దారుణాలకు ఎక్కువ డిజిటల్‌ ఉపకరణాలే కారణమవుతున్నాయి. ఇంటర్నెట్‌, విద్య, వినోదం, సామాజిక పరస్పర చర్యల్లో డిజిటల్‌ పరికరాలు అనివార్యంగా మారాయి. ఇవి ఎంత మేలు చేస్తున్నాయో.. తప్పుగా వినియోగిస్తే అంతే కీడుకూడా చేస్తున్నాయి. వీటికి బలవుతున్న వారిలో మైనర్లు, యువత అధికంగా ఉండం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచం డిజిటలైజేషన్‌ కావటంతో పాటు డిజిటల్‌ పరికరాలు మైనర్ల చేతుల్లోకి వెళ్లడం, తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకుండా ఒంటరిగా వదిలేయడం కారణాలుగా నిలుస్తున్నాయి. కొంత మంది యువత, మైనర్లు అపరిచిత వ్యక్తులు, వెబ్‌ సైట్లలో ఆన్‌లైన్‌ గేమ్‌లు, బెట్టింగుల ద్వారా డబ్బులు నష్టపోతున్నారు. మరికొందరు పోర్న్‌ వీడియోలు చూసి ఆకర్శితులవుతున్నారు. అపరిచిన వ్యక్తులకు వ్యక్తిగత విషయాలు, ఫొటోలు, వీడియోలు షేర్‌ చేయడంతో వాటిని మార్ఫింగ్‌ చేస్తున్నారు. తద్వారా బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతూ లైంగిక దాడులు, బ్యాంక్‌ ఖతాలు లూటీ చేస్తున్నారు. ఇంకొన్ని ఘటనల్లో సన్నిహితంగా ఉన్న సమయంలో ఫొటోలు, వీడియోలు తీసి బెదిరింపులకు దిగుతూ లైంగిక దాడులకు పాల్పడుతున్నారు.

పోలీసుల సూచనలు

● ఇన్‌స్ట్రాగామ్‌, ఫేస్‌బుక్‌, స్నాప్‌ చాట్‌ లాంటి సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఫ్రొఫైల్స్‌తో సైబర్‌ నేరగాళ్లు మైనర్లకు దగ్గరవుతున్నారు.

● తల్లిదండ్రులు పిల్లల ఆన్‌లైన్‌ వినియోగాన్ని పర్యవేక్షిస్తూ దిశానిర్దేశం చేయాలి. వారి సోషల్‌ మీడియా ఖాతాలు పర్యవేక్షించాలి.

● పిల్లల సమస్యలు తల్లిదండ్రులకు చెప్పుకొనే స్నేహపూర్వక వాతావరణం కల్పించాలి.

● ఫొటోలు, వ్యక్తిగత విషయాలు, వీడియోలు సోషల్‌ మీడియా వేదికలో ఇతరులతో షేర్‌ చేయకుండా అవగాహన కల్పించాలి.

● కొందరు నేరగాళ్లు, తప్పుడు ఆలోచనలు కలిగిన వ్యక్తులు పిల్లలతో పరిచయాలు పెంచుకోవడం, వారితో నమ్మకంగా వ్యవహరిస్తూ మోసాలకు పాల్పడే అవకాశం ఉంది. అందుకే తెలియని వ్యక్తులను ఫాలో కావటం, ఫ్రెండ్‌ రిక్వెస్టులను యాక్సెప్ట్‌ చేయడం, లైక్‌ చేయటం లాంటివి చేయకూడదు..

● వారికి తమ కుటుంబ సమాచారం, పాఠశాల సమాచారం, లోకేషన్లు ఫేర్‌ చేయటం, ఓటీపీలు చెప్పడం, అనుమానాస్పద లింకులను క్లిక్‌ చేయకుండా జాగ్రత్త పడాలి.

● పిల్లలు తెలియకుండా ఇలాంటి ప్రమాదాల బారిన పడితే వెంటనే ఎవరిని సంప్రదించాలి. ఎలా నడుచుకోవాలో వారికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నేర్పించాలి. పిల్లల గోప్యతను గౌరవిస్తూనే వారికి తగిన పరిమితులు ఏర్పాటు చేయడం తప్పనిసరి.

జిల్లాలో పెరుగుతున్న

పోక్సో కేసులు

బాలికల భద్రతపై సర్వత్రా ఆందోళన

పోలీసులు అవగాహన కల్పిస్తున్నా ఆగని దాడులు

డిజిటల్‌ మోసాలకు బలవకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై షీం టీంల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. ఏవైనా అనుకోని ఘటనలు జరిగితే పోలీసుల నుంచి ఎలా సాయం తీసుకోవాలో వివరిస్తున్నారు. బాలికలకు అండగా ఉండే చట్టాలు, నిందితులకు పడే శిక్షలు తదితర అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం. పిల్లల డిజిటల్‌ భద్రత, గోప్యత, వారి సమగ్ర శ్రేయస్సు విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి. అత్యవసర సమయంలో 112 నంబర్‌లో సంప్రదించాలి.

– స్నేహమెహ్ర, ఎస్పీ, వికారాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement