పరిగి: జ్ఞాన సమాజ నిర్మాణమే లక్ష్యంగా స్వేరోస్ ముందుకు సాగుతుందని నెట్‌వర్క్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు లక్నాపూర్ శ్రీనివాస్ అన్నారు. శనివారం పట్టణ కేంద్రంలో స్వేరో నెట్‌వర్క్ జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా ముకుంద్, ప్రధానకార్యదర్శిగా విజయ్‌కుమార్, ఉపాధ్యక్షులుగా మహిపాల్, అరవింద్, కోశాధికారిగా నరేందర్, జాయింట్ సెక్రటరీగా ప్రవీణ్, నర్సింలు, వినయ్, ఆర్గనైజర్ సెక్రటరీగా మహేశ్, కృష్ణ, సభ్యులుగా బాబు, వెంకటయ్య, శ్రావణ్‌కుమార్ తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం అనే నినాదంతో ప్రజలను చైతన్యం చేస్తున్నామన్నారు. స్వేరోస్ ఎంతో మంది విద్యార్థులను ఉన్నత స్థానంలో నిలిపిందని గుర్తు చేశారు. డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆలోచన విధానాన్ని గ్రామస్థాయిలో గడప గడపకు గుండె గుండెకు తీసుకెళ్లేందుకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని సూచించారు. మహానీయులు పూలే, అంబేడ్కర్ ఆశయాల కోసం నిరంతరం పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మైలారం జగన్, వెంకటేశ్, మహిపాల్, కృష్ణ, అరుణ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
స్వేరోస్ నెట్‌వర్క్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాస్


