కొడంగల్‌లో ఆధునిక సౌకర్యాలతో నూతనంగా బస్టాండ్ కాంప్లెక్స్ నిర్మాణానికి సీఎం రేవంత్‌రెడ్డి రూ.16 కోట్ల 64 లక్షలు మంజూరు చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి దశల వారీగా నిధులు మంజూరు చేస్తోంది. సమీప భవిష్యత్తులో కొడంగల్ రాష్ట్రంలోనే అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా రూపుదిద్దుకోనుంది. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ తిరుపతిరెడ్డి సహకారంతో నిధులు విడుదలయ్యాయి.
– నందారం ప్రశాంత్,
మున్సిపల్ చైర్మన్, కొడంగల్


