గణేశుడి కృప ఉండాలి | - | Sakshi
Sakshi News home page

గణేశుడి కృప ఉండాలి

Sep 23 2026 8:33 AM | Updated on Sep 23 2026 8:33 AM

అనంతగిరి: వినాయకుని ఆశీర్వాదంతో వర్షాలు సమృద్ధిగా కురవాలని స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌ అన్నారు. వికారాబాద్‌ పట్టణంలోని ఆయా వాడల్లో ప్రతిష్ఠించిన గణనాథులను సోమవారం రాత్రి సందర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వినాయక చవితి అంటేనే చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఒక్క చోట చేరి చేసుకునే గొప్ప పండుగ అన్నారు. ఇలాంటి పండుగలు ప్రజల్లో ఐక్యతను పెంచుతాయన్నారు. ప్రజా పాలనలో రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని స్వామివారిని వేడుకున్నానని తెలిపారు. పాడి పంటలతో రాష్ట్రం సస్యశ్యామలం కావాలని ప్రార్థించానన్నారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తిశ్రద్ధలతో మండపాలను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న నిర్వాహకులను స్పీకర్‌ అభినందించారు. ఉత్సవాలను ఎంత వైభవంగా నిర్వహిస్తున్నామో, నిమజ్జన ఘట్టంలోనూ అంతే అప్రమత్తత, జాగ్రత్తలు అవసరమని నిర్వాహకులకు సూచించారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులు వికారాబాద్‌ ప్రజలకు, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ సుధాకర్‌ రెడ్డి, కౌన్సిలర్లు లక్ష్మీకాంత్‌ రెడ్డి, హిరేకర్‌ రాకేష్‌, వినోద్‌ కుమార్‌, మురళి, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ సత్యనారాయణ, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చాపల శ్రీనివాస్‌, వైస్‌ చైర్మన్‌ మల్లేశం, ఏఎంసీ మాజీ చైర్మన్‌ విజయ్‌ కుమార్‌, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు ముత్తాహర్‌ షరీఫ్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు రాములు తదితరులు పాల్గొన్నారు.

స్వామి ఆశీస్సులతో వర్షాలు సమృద్ధిగా కురవాలి

స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement