ధారూరు: మండలంలోని తరిగోపుల గ్రామంలో గణేశ్ లడ్డూకు మంగళవారం వేలం నిర్వహించారు. గ్రామానికి చెందిన వీరబొమ్మ జగదీశ్వర్ రూ.1,11,111కు లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్నారు. మరో చిన్న లడ్డూను నల్లాల నవీన్‌రెడ్డి రూ.80 వేలకు దక్కించుకున్నారు. కుక్కింద గ్రామంలో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి లడ్డూను రూ.24,500 ఐదు మంది కలిసి తీసుకున్నారు.
అనంతగిరి: అంతర్జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని వికారాబాద్‌లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని బీటీఎస్ కాలనీలో యోగా, మెడిటేషన్ కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయుష్ మెడికల్ ఆఫీసర్ అంజూమ్ మాట్లాడుతూ.. నిత్య జీవితంలో యోగా ఒక భాగమైందన్నారు. ఆయుర్వేదంలో అన్ని వ్యాధులకు చికిత్స ఉందన్నారు. కార్యక్రమంలో డీపీఎం వంశీధర్, యోగా గురువుల మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్
బొంరాస్‌పేట: సర్ రెండో విడత ప్రక్రియలో భాగంగా నోటీసులు అందుకున్న ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు విలువ తెలియజేద్దామని డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్ అన్నారు. మంగళవారం దుద్యాల, బొంరాస్‌పేట మండలాల్లో పార్టీ నాయకులు, బీఎల్‌ఏలతో సమీక్ష నిర్వహించారు. దుద్యాల మండలం సర్ ప్రక్రియలో పూర్తిగా వెనకబడిపోయిందన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్‌రెడ్డి, కొడంగల్ ఏఎంసీ వైస్ చైర్మన్ వేణుగోపాల్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకట్రాములు గౌడ్, నాయకులు మల్లేశ్, మల్లికార్జున్, మేరుగు వెంకటయ్య, ముజీబ్, ఆయా మండలాల అధ్యక్షులు ఆవుటి శేఖర్, నర్సింలుగౌడ్, సర్పంచులు వీరేశం, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.
కొడంగల్ రూరల్: పట్టణంలో నూతనంగా నిర్మించిన ఆస్పత్రి, మహాత్మా జ్యోతిబా పూలే, సోషల్ వెల్ఫేర్ గురుకుల, ఇంజనీరింగ్, నర్సింగ్ కళాశాలలు, శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో దోబీ పోస్టులను భర్తీ చేయాలని రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గోపి, జిల్లా అధ్యక్షుడు సీహెచ్ రవీందర్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా, నియోజకవర్గ రజక రిజర్వేషన్ సమితి సభ్యులతో కలిసి ఆయా కార్యాలయాల్లో సంబందిత అధికారులకు వినతిపత్రాలు అందించారు. కార్యక్రమంలో రజక రిజర్వేషన్ సమితి జిల్లా గౌరవ అధ్యక్షుడు మొగులప్ప, ఉపాధ్యక్షుడు గడ్డమీది వెంకటప్ప, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అశోక్, నాయకులు బాలప్ప, మొగులప్ప, లక్ష్మి, లలిత, వెంకటయ్య, శ్యామప్ప, కృష్ణ, ఇందిరమ్మ, ఆనందమ్మ, రుక్కమ్మ, కావమ్మ, లావణ్య తదితరులు పాల్గొన్నారు.
అనంతగిరి: గణేశ్ నిమజ్జనం శాంతియుతంగా ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజలంతా సహకరించాలని వికారాబాద్ టౌన్ సీఐ రఘుకుమార్ మంగళవార ఒక ప్రకటనలో కోరారు. డీజేలు లేకుండా సంప్రదాయ బద్ధంగా, భక్తిశ్రద్ధలతో చేపట్టాలని సూచించారు. మధ్యాహ్నం రెండు గంటలలోపు కొత్తగంజ్‌కు విగ్రహాలు చేరుకోవాలన్నారు. ఉత్తమ వినాయక మండపానికి రూ.10వేల నగదు పురస్కారం అందజేయనున్నట్లు ఆయన తెలిపారు.


