వేడుకలు విజయవంతం చేద్దాం | - | Sakshi
Sakshi News home page

వేడుకలు విజయవంతం చేద్దాం

Sep 23 2026 8:33 AM | Updated on Sep 23 2026 8:33 AM

పరిగి: గణేశ్‌ నిమజ్జన ఏర్పాట్లు పక్కాగా ఉండాలని, ఎలాంటి పొరపాట్లకు అస్కారం ఇవ్వకుండా విజయవంతం చేయాలని పరిగి ఎమ్మెల్యే టీ రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని లక్నాపూర్‌ ప్రాజెక్టును డీఎస్పీ శ్రీనివాస్‌తో కలిసి సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. నిమజ్జనం ప్రశాంతంగా, సజావుగా జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. లక్నాపూర్‌ ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. పరిగి పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి తీరుతామని తెలిపారు. అనంతరం ఎస్పీ స్నేహమెహ్రతో కలిసి డీఎస్పీ నూతన కార్యాలయాన్ని పరిశీలించారు. త్వరలో భవనాన్ని ప్రారంభిస్తామని తెలిపారు.

నిమజ్జన ఏర్పాట్లు పక్కాగా ఉండాలి

ఎలాంటి పొరపాట్లకు అస్కారం ఇవ్వొద్దు

పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement