అందుబాటులో వ్యాక్సిన్స్
బంట్వారం: కుక్క, పాము కాటు మందులు బంట్వారం, కోట్‌పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయి. నిత్యం 60 మందికి పైగా ఔట్ పేషెంట్లు వస్తున్నారు. సోమవారం స్పాట్ విజిట్ సమయంలో డాక్టర్లు మజీద్‌ఖాన్, మేఘన రోగులను పరీక్షించారు. సరిపడా మందులు అందుబాటులో ఉన్నాయి. స్థానింగా ర్యాపిడ్ పరీక్షలు చేస్తున్నారు. వీటి రిపోర్టు వెంటనే వస్తుంది. ల్యాబ్ పరీక్షలకు సంబంధించి రక్త నమూనాలను వికారాబాద్‌లోని టీజీ హబ్‌కు పంపుతున్నారు. వీటి రిపోర్టు 24 గంటల్లో పేషెంట్ మొబైల్‌కు మెసేజ్ వస్తుంది.


