ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు గైర్హాజరు
తాండూరు: తాండూరులోని కొడంగల్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నిర్వహణ పరిస్థితి దయనీయంగా మారింది. సోమవారం తాండూరులోని కొడంగల్ జనరల్ ఆస్పత్రిని ‘సాక్షి’పరిశీలించగా వైద్యాధికారులు ఎవరు కనిపించలేదు. జూనియర్ డాక్టర్‌లతో సేవలు అందించారు. మాతాశిశు ఆస్పత్రిలో రక్తనమూనా పరీక్షల పడిగాపులు కాస్తున్నారు. డీఎంఈ ఆధీనంలోకి వెళ్లిన తర్వాత రక్తనమూనా పరీక్షలు సరిగా జరగడం లేదు. టీహబ్ నుంచి రిపోర్టులు అందక ప్రజలు ప్రైవేటు డయాగ్నోస్టిక్ సెంటర్‌లను ఆశ్రయిస్తున్నారు. జనరల్ ఆస్పత్రిలో 25 మంది ఫ్రొఫెసర్లు, అసిస్టెంట్ ఫ్రొఫెసర్లకు ఏ ఒక్కరు హాజరవలేదు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత సూపరింటెండెంట్ వచ్చి ఫైల్స్‌పై సంతకాలు చేసి వెళ్లిపోయారు.


