పరిగి: పట్టణ కేంద్రంలోని సీహెచ్‌సీ(కమ్యూనిటీ హెల్త్ సెంటర్)కు 500 మంది వరకు ఓపీ వచ్చింది. సోమవారం పట్ణంలోని సీహెచ్‌సీని ‘సాక్షి’పరిశీలించగా.. రోగుల సంఖ్యకు తగినట్లు వైద్యులు, సిబ్బందులు లేక ఇబ్బంది పడ్డారు. 30 మంది ఉండాల్సిన ఆస్పత్రిలో 16 మందిని కేటాయించారు. ఇందులో 14 మందికి గాను ముగ్గురు డిప్యూటేషన్‌పై వెళ్లడంతో 11 మంది వైద్యులు విధులు నిర్వహిస్తున్నారు. నైట్ డ్యూటీలో ఓ డాక్టర్, ముగ్గురు నర్సులు సేవలు అందిస్తున్నారు. కాగా పని ఒత్తిడి కారణంగా సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని.. వైద్యులతో పాటు సిబ్బందిని పెంచాలని పలువురు రోగులు పేర్కొన్నారు.


