కుల్కచర్ల: సీజనల్ ప్రభావంతో ఆస్పత్రులకు రోగుల తాడికి పెరిగింది. సోమవారం కుల్కచర్ల ప్రభుత్వ ఆసుపత్రిని ‘సాక్షి’పరిశీలించగా సుమారు 180 మంది పేషెంట్లు వచ్చారు. కుల్కచర్ల, చౌడాపూర్ మండలాలకు ఒక్కటే ప్రభుత్వ ఆస్పత్రి. సోమ, బుధ, శుక్ర వారాల్లో వంద నుంచి 250 మంది వరకు వైద్య పరీక్షలకు హాజరవుతున్నారు. ఇక్కడ ఒక్కరే వైద్యాధికారి ఉండటంతో కొంత ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. మెడికల్ టెస్టులు సేకరించేందుకు కుల్కచర్ల, దోమ ఆస్పత్రులకు ఒక్కరే కావడంతో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి.


