అత్యవసరమైతే హైదరాబాద్‌కే.. | - | Sakshi
Sakshi News home page

అత్యవసరమైతే హైదరాబాద్‌కే..

Sep 22 2026 10:08 AM | Updated on Sep 22 2026 10:08 AM

అత్యవసరమైతే హైదరాబాద్‌కే..

అనంతగిరి: వికారాబాద్‌ ప్రభుత్వాస్పత్రికి రోగుల తాకిడి పెరిగింది. సోమవారం ‘సాక్షి’పరిశీలనలో 600కు పైగా ఓపీ వచ్చింది. ఇక్కడ జనరల్‌ సర్జరీలు మాత్రమే జరుగుతున్నాయి. ఆస్పత్రి ఆవరణలో మరో 50 పడకల క్రిటికల్‌ కేర్‌ భవనం నిర్మాణం పూర్తయింది. బెడ్‌లు వచ్చాయి. పరికరాలు రాకపోవడం, సంబంధిత సిబ్బంది నియామకం చేపట్టక ఇక్కడ సేవలు ప్రారంభించలేదు. దీంతో అత్యవసర సమయాల్లో హైదరాబాద్‌కు రెఫర్‌ చేస్తున్నారు.

● ఆస్పత్రిలో ఎంఆర్‌ఐ, సిటీస్కాన్‌ లేవు.

● 2–డి ఇకో మిషన్‌ ఉన్నా.. టెక్నీషియన్‌లు లేక సేవలు కొనసాగడం లేదు.

● ఓపీకి పెద్ద ఎత్తున రోగులు వస్తున్నా షెడ్‌ లేక ఎండలోనే నిల్చుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement