అనంతగిరి: దివ్యాంగులకు రాజ్యాంగం కల్పించిన హక్కులపై అవగాహన ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జడ్జి రాధిక సూచించారు. శుక్రవారం వికారాబాద్ పట్టణంలోని రవీంద్ర మండపంలో దివ్యాంగుల హక్కులు, ఉచిత న్యాయ సేవలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజ్యాంగం కల్పించిన హక్కులు, ఉచిత న్యాయ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అనంతరం జిల్లా సంక్షేమ అధికారి కాంతారావు మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఆర్థిక సహాయం, పునరావాస సేవలను వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ రాము, డీసీపీఓ శ్రీకాంత్, సీడీపీఓ శ్రీలత, ఆయా సంఘాల ప్రతినిధులు కావలి నర్సింహులు, సుధీర్, శ్యామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
దివ్యాంగులకు ఉచిత న్యాయ సహాయం
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జడ్జి రాధిక


