కొడంగల్: పట్టణంలోని ప్రభుత్వాస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ క్యాంటిన్‌లో భోజనం బాగుందని మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్, కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి అన్నారు. శుక్రవారం క్యాంటిన్‌ను సందర్శించి భోజనం చేశారు. రూ.5లతో పేదల ఆకలి తీరుస్తున్నట్లు చెప్పారు. కార్మికులకు, నిరుపేదలకు తక్కువ ధరకు మంచి భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. ఉదయం రూ.5లకే అల్పాహారం, మధ్యాహ్నం రూ.5లకే భోజనం పెడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్, వైస్ చైర్మన్ శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. పురోగతి సాధించాలని కాంట్రాక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు.


