9 పాఠశాలలకు రూ.106 కోట్ల నిధులు | - | Sakshi
Sakshi News home page

9 పాఠశాలలకు రూ.106 కోట్ల నిధులు

Sep 12 2026 11:09 AM | Updated on Sep 12 2026 11:09 AM

కొడంగల్‌: నియోజకవర్గంలోని 9 పాఠశాలలకు రూ.106.80 కోట్ల నిధులు మంజూరయ్యాయి. పాఠశాల విద్యాశాఖ తెలంగాణ పబ్లిక్‌ స్కూల్స్‌ పేరున నిధులు విడుదలయ్యాయి. ప్రీ ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు అభ్యాసన ఫలితాలను మెరు గు పరచడానికి వీలుగా వివిధ పనులను చేసేందుకు పరిపాలనా అనుమతులకు ఉత్తర్వులు జారీ చేశారు. ఆధునిక మౌలిక సదుపాయాలు, సమగ్ర విద్యా సౌకర్యాల ద్వారా అనుకూలమైన వాతావరణంలో నాణ్యమైన విద్యను అందించే ఆదర్శ సంస్థలుగా ఈ పాఠశాలలను తీర్చిదిద్దనున్నారు. నియోజకవర్గంలోని కొడంగల్‌ జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాల, బొంరాస్‌పేట, దుద్యాల, దౌల్తాబాద్‌, కోస్గి, కొత్తపల్లి, మద్దూరు, గుండుమల్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలకు నిధులు మంజూరు చేశారు. విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్‌ యోగితా రాణా ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement