మహాధర్నాను విజయవంతం చేయండి | - | Sakshi
Sakshi News home page

మహాధర్నాను విజయవంతం చేయండి

Aug 27 2026 7:20 AM | Updated on Aug 27 2026 7:20 AM

మహాధర్నాను విజయవంతం చేయండి ముసాయిదాపై నేడు గ్రామ సభలు మైసిగండి ఆలయంలో హైకోర్టు జడ్జి పూజలు

ఉద్యోగుల జేఏసీ జిల్లా చైర్మన్‌ యశ్వంత్‌

ఇబ్రహీంపట్నం: హక్కుల సాధన కోసం ఇందిరాపార్క్‌ వద్ద గురువారం హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల ఉద్యోగులు నిర్వహించనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని ఉద్యోగ జేఏసీ జిల్లా చైర్మన్‌ యశ్వంత్‌ బుధవారం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. పోరాటాలతోనే హక్కులు సాధించుకోవాలని.. ఈ ధర్నాకు ఉద్యోగులు, గెజిటెడ్‌ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు.

హుడాకాంప్లెక్స్‌: ముసాయిదా ఓటర్‌ జాబితా క్లెయిమ్స్‌, అభ్యంతరాల స్వీకరణ, విచారణలో భాగంగా గురువారం ఉదయం 9 గంటల నుంచి సరూర్‌నగర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల సహా హుడాకాంప్లెక్స్‌లోని సీనియర్‌ సిటిజన్‌ న్యూ బిల్డింగ్‌, క్రాంతినగర్‌ రెసిడెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ భవనం, డాక్టర్స్‌ కాలనీలోని సీనియర్‌ సిటిజన్‌ భవన్‌, భగత్‌సింగ్‌నగర్‌లోని బస్తీ దవాఖానాలో గురువారం గ్రామసభలు నిర్వహించనున్నట్లు తహసీల్దార్‌ వేణుగోపాల్‌ వెల్లడించారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఓటర్ల జాబితా పరిశీలనలో మ్యాపింగ్‌ కాని ఓటర్లందరూ సంబంధిత గ్రామ సభకు హాజరై నోటీసులను స్వీకరించవచ్చని, మ్యాపింగ్‌కాని ఓటర్లు సమర్పించాల్సిన పత్రాలు, ఆధారాల వివరాలను సంబంధిత బీఎల్‌ఓలు వారికి వివరిస్తారని తెలిపారు. అవసరమైన పత్రాలను సమర్పించి, క్లెయిమ్‌ను నమోదు చేసుకోవచ్చని సూచించారు. కొత్తగా ఓటరుగా నమోదు కావాలనుకునే అర్హత కలిగిన పౌరులు ఫారం– 6 సమర్పించవచ్చన్నారు. ఓటరు పేరు తొలగింపుకు ఫారం– 7, ఓటరు వివరాల్లో మార్పులు, సవరణలు లేదా నివాసం మార్పు కోసం ఫారం– 8 సమర్పించవచ్చని, ముసాయిదా ఓటర్ల జాబితాపై వచ్చిన అన్ని క్లెయిమ్స్‌ మరియు అభ్యంతరాలపై గ్రామ సభల్లో విచారించనున్నారని, ఈ అవకాశాన్ని ఓటర్లు సద్వినియోరగం చేసుకోవాల్సిందిగా సూచించారు.

కడ్తాల్‌: మండల పరిధిలోని మైసిగండి మైసమ్మ ఆలయాన్ని బుధవారం హైకోర్టు న్యాయమూర్తి ప్రవీణ్‌కుమార్‌ దంపతులు దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహకులు వారికి ఆల య సంప్రదాయ ప్రకారం ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు ఇచ్చి ఆశీర్వచనలు అందజేశారు.

పేకాట స్థావరంపై దాడి

ఎనిమిది మంది అరెస్ట్‌

కొందుర్గు: పేకాట స్థావరంపై దాడిచేసిన పోలీసులు ఎనిమిది మందిని అరెస్ట్‌ చేశారు. ఈ ఘటన మండల పరిధిలోని మట్పూర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. గ్రామ శివారులోని శ్రీనివాస్‌రెడ్డికి చెందిన వ్యవసాయ పొలంలో పేకాడుతున్నట్లు బుధవారం విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు షాద్‌నగర్‌ ఎస్‌ఓటీ పోలీసులు, కొందుర్గు పోలీసులు దాడి చేసి ఎనిమిదిమందిని అదుపులోకి తీసుకున్నవారు. వారి వద్ద నుంచి రూ.29,900 నగదు, ఆరు సెల్‌ఫోన్లు, ఓ బొలెరో వాహనం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.

మట్టి తవ్వకాలు చేపట్టిన వారిపై కేసు

ఇబ్రహీంపట్నం: ప్రభుత్వ భూముల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు చేపట్టిన వారిపై కేసు నమో దు చేశారు. ఈ ఘటన బుధవారం సీతారాంపేట గ్రామ రెవెన్యూ పరిధిలో చోటు చేసుకుంది. ఇబ్రహీపంట్నం సీఐ మహేందర్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. అక్రమంగా మట్టి తవ్వకాలు చేపడుతున్నట్లు సమాచారం అందడంతో ఇబ్రహీంపట్నం రెవెన్యూ, పోలీసు అధికారులు సంయుక్తంగా దాడులు చేపట్టారు. ఓ ఇటాచీ వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదచేశామన్నారు. ప్రభుత్వ భూముల్లో నుంచి అక్రమంగా మట్టి తవ్వినా, తరలించినా క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

రోడ్డుకు మరమ్మతులు

కేశంపేట: మండల పరిధిలోని కొనాయపల్లి సర్పంచ్‌ సొప్పరి ధనలక్ష్మి రామకృష్ణ గ్రామ రోడ్డుకు మరమ్మతులు చేపట్టారు. గ్రామంలో బోనాల పండుగను పురస్కరించుకొని రోడ్డుపై ఏర్పడిన గుంతల్లో మట్టి వేయించి, చదును చేయించారు. కార్యక్రమంలో గ్రామస్తులు రంగు నర్సింహ, బర్కం రామకృష్ణ, సొప్పరి నర్సింహ, గోపి రాము, రంగు శ్రీకాంత్‌, చంద్రశేఖర్‌, రామస్వామి, సొప్పరి నరేందర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement