యాచారం: కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్తాపం చెందిన ఓ యువతి ఇంటి నుంచి వెళ్లిపోయిన సంఘటన హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలివీ.. తాడిపర్తి గ్రామానికి చెందిన దార రామచంద్రమ్మ, సాయిలు దంపతులు. కుమార్తె మంజుల (33) వ్యవహారశైలిపై ఇటీవల కుటుంబసభ్యులు మందలించారు. దీంతో మనస్తాపం చెందిన ఆమె ఈనెల 21న ఇంటి నుంచి వెళ్లింది. బంధువుల ఇళ్ల వద్ద వెతికినా జాడ తెలియకపోవడంతో తల్లి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మానసికస్థితి సరిగా లేని యువకుడు..
మాడ్గుల: మానసికస్థితి సరిగా లేని యువకుడు అ దృశ్యమైన సంఘటన మాడ్గుల ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. సీఐ వేణుగోపాలరావు ప్రకారంమండల పరిఽధిలోని కాట్రావ్‌తండాకు చెందిన కాట్రావత్ గోవర్ధన్ (20) పదో తరగతి పూర్తి చేశాడు. మానసిక స్థితి సరిగాలేక ఇంటి వద్దే ఉంటూ వ్యవసాయ పనులు చేసుకుంటున్నాడు. ఈ నెల 23న సాయంత్రం నాగిళ్ల గ్రామానికి వెళ్లి కటింగ్ చేసుకొని వస్తానని చెప్పి బైక్‌పై వెళ్లి తిరిగి రాలేదు. తల్లి బుజ్జి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


