బొంరాస్‌పేట: కరాటే, కుంగ్‌ఫూ జూనియర్ విభాగంలో మహబూబ్‌నగర్‌లో ఆదివారం నిర్వహించిన ఐదో జాతీయ స్థాయి పోటీల్లో జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులు బంగారు పథకాలు సాధించారు. ఈ మేరకు సోమవారం పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థులను అభినందించింది. ఎనమిదో తరగతి విద్యార్థినులు విస్లావత్ అవంతి, తలారి కరాటే సబ్ జూనియర్ కటాస్ విభాగంలో గోల్డ్‌మెడల్స్ సాధించడం గర్వకారణమని ఎంఈఓ హరిలాల్, ఉపాధ్యాయులు అన్నారు. శ్రీహనుమాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు మెడల్స్, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఉపాధ్యాయులు అనిల్‌కుమార్, షాహెద, సుశీల తదితరులు పతకాలు సాధించిన విద్యార్థులను సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఉపాధ్యాయులు బాకారం చంద్రశేఖర్, శివరాజ్, ఇజాజ్, వందన, వెంకటయ్య తదితరులున్నారు.


