లెక్చరర్‌పై చర్యలకు డిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

లెక్చరర్‌పై చర్యలకు డిమాండ్‌

Aug 25 2026 12:04 PM | Updated on Aug 25 2026 12:04 PM

తాండూరు టౌన్‌: మైనర్‌ను లైంగికంగా వేధించిన తాండూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల లెక్చరర్‌ను వెంటనే అరెస్టు చేయాలని పలు ప్రజా సంఘాల నాయకులు సోమవారం డిమాండ్‌ చేశారు. బాలికకు వాట్సాప్‌ ద్వారా మెసేజ్‌లు చేస్తూ, లైంగిక వేధింపులకు పాల్పడిన లెక్చరర్‌పై పోక్సో కేసు నమోదు చేయాలన్నారు. ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా పలువురు లెక్చరర్‌కు అండగా నిలిచారన్నారు. కలెక్టర్‌ వెంటనే స్పందించి ఈ విషయంపై విచారణ జరిపించి తగు చర్యలు తీసుకోవాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్‌, కేవీపీఎస్‌ జిల్లా కార్యదర్శి మల్కయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బుగ్గప్ప, లాలప్ప, అశోక్‌ తదితరులు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement