అనంతగిరి: ఉద్యోగుల న్యాయమైన డిమాండ్‌లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని ఉద్యోగ జేఏసీ జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. ఈ నెల 27న నిర్వహించే మహాధర్నా కార్యక్రమానికి సంబంధించి సోమవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను వెంటనే మంజూరు చేయాలని, పీఆర్‌సీ, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యోగ జేఏసీలో భాగస్వామ్యం ఉన్న అన్ని సంఘాల నాయకులు కలిసి మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ జేఏసీ జిల్లా ప్రతినిధులు అబ్దుల్ సత్తార్, అజ్మత్ పాషా, నర్సింలు, కుమార్, వెంకటరత్నం, రాఘవేందర్, అఫ్జల్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగ జేఏసీ జిల్లా ప్రతినిధులు


