కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలి | - | Sakshi
Sakshi News home page

కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలి

Aug 25 2026 12:04 PM | Updated on Aug 25 2026 12:04 PM

తాండూరు రూరల్‌: పంచాయతీ కార్మికులకు రూ.26 వేల నెలసరి వేతనం చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన సంఘంన నాయకులు, పంచాయతీ కార్మికులతో కలిసి ఎంపీడీఓ విశ్వప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వాలు మారిన పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కారం కావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మల్టీపర్పస్‌ విధానాన్ని రద్దు చేసి కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్మికులు వెంకటప్ప, జగన్‌, శ్రీనివాస్‌, అంజిలప్ప, గుండప్ప తదితరులు పాల్గొన్నారు.

రూ.26 వేల వేతనం చెల్లించాలి

సీఐటీయూ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement