తాండూరు రూరల్: అడవిని కాపాడుతూ.. ప్రకృతిని ప్రేమిస్తున్న చెంచులు ఐక్యంగా ఉండాలని ట్రైబల్ వెల్ఫేర్ జిల్లా అధికారి జనార్దన్ అన్నారు. ఆదివారం పెద్దేముల్ మండలం చైతన్యనగర్ గ్రామంలో సర్పంచ్ మాదాసి గౌరమ్మ అధ్యక్షతన ఆదివాసి దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెంచులు చదువు, రాజకీయాలు, ఉపాధి, హక్కులు, సామాజిక అభివృద్ధి దిశగా పయనించాలని సూచించారు. పిల్లలను ఉన్నత చదువుల్లోనే రాణించేలా ప్రోత్సహించాలన్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ప్రభుత్వ స్కాలర్‌ిషిప్, రిజర్వేషన్లు, ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని, వ్యవసాయం, పశుపోషణ, చిన్న పరిశ్రమల ద్వారా ఆదాయ మార్గాలను పెంచుకోవాలని సూచించారు. చెంచుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాములు, గ్రామస్తులు అంజిలయ్య, శ్రీనివాస్, లాలయ్య, రాములు, రాజన్న, విక్రమ్‌సింగ్, హన్మంత్, భరత్, లింగం, తిరుపతి, లాలు పాల్గొన్నారు.
ట్రైబల్ వెల్ఫేర్ జిల్లా అధికారి జనార్దన్


