రెండింతలు! | - | Sakshi
Sakshi News home page

రెండింతలు!

Aug 8 2026 8:43 AM | Updated on Aug 8 2026 8:43 AM

సాగు విస్తీర్ణం ఇలా..

దరఖాస్తు చేసుకోండి

ఏటా రూ.2.5 లక్షల ఆదాయం

వికారాబాద్‌: జిల్లాలో లక్ష్యానికి మించి ఆయిల్‌ పామ్‌ పంట సాగవుతోంది. 90శాతం సబ్సిడీపై మొక్కలు, డ్రిప్‌ పరికరాలు ఇస్తుండటంతో ఎక్కువ మంది రైతులు ఆసక్తి చూపుతున్నారు. పంట ఉత్పత్తులకు మంచి డిమాండ్‌ ఉండటం కూడా ఓ కారణంగా చెప్పవచ్చు. భవిష్యత్‌ అవసరాలు, డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఉద్యాన శాఖ అధికారులకు టార్గెట్‌ విధించింది. రెండేళ్ల క్రితం వరకు ఈ పంట సాగుపై రైతులకు అవగాహన లేకపోవడంతో ఎవరూ ముందుకు రాలేదు. పామాయిల్‌ ఆవశ్యకతను గుర్తించిన ప్రభుత్వం సాగుపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించింది. దీంతో రైతులు పెద్ద సంఖ్యలో ముందుకు వస్తున్నారు. ఇటీవల ఆయిల్‌ పామ్‌ కంపెనీ ఏర్పాటుకు హకీంపేట్‌లో 30 ఎకరాల భూమిని కూడా కేటాయించారు. త్వరలో పరిశ్రమ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కలెక్టర్‌ దీపక్‌ తివారి సాగు విస్తీర్ణం పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. స్వయంగా తోటలను పరిశీలిస్తున్నారు. ఉద్యాన శాఖ అధికారులతో కలిసి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.

ఇక్కడి నేలలు అనుకూలం

జిల్లాలో గత ఏడాది టార్గెట్‌కు రెండింతలు సాగు చేశారు. ప్రస్తుత సంవత్సరంలో లక్ష్యానికి మించి రైతులు పేర్లు నమోదు చేసుకున్నారు.

జిల్లాలో 5.93 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయి. ఇందులో ఉద్యాన పంటలు 50వేల ఎకరాల్లో ఉంటాయి. ఆయిల్‌ పామ్‌ సాగుకు 50వేల ఎకరాలు అనుకూలంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. గత ఏడాది 2వేల ఎకరాలు లక్ష్యం పెట్టుకోగా 4,500 ఎకరాల్లో సాగు చేశారు. ప్రస్తుత ఏడాదిలో మరో 2,400 ఎకరాలు టార్గెట్‌ ఇవ్వగా ఇప్పటికే 3,300మంది రైతులు పేర్లు నమోదు చేసుకున్నారు. అధికారులు మాత్రం 20వేల ఎకరాల్లో సాగయ్యేలా టార్గెట్‌ పెట్టుకున్నారు. 7,800 ఎకరాల్లో సాగు చేసేందుకు రైతులను ఒప్పించారు.

అంతర పంటల సాగుకు..

ఆయిల్‌ పామ్‌ సాగుకు ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు, రాయితీలు ఇస్తోంది. ఐదెకరాల వరకు సాగు చేసే సన్న, చిన్నకారు రైతులకు 90శాతం రాయితీపై మొక్కలు అందజేస్తోంది. మరో 90శాతం సబ్సిడీపై డ్రిప్‌ పైపులు కూడా ఇవ్వాలని నిర్ణయించింది. అంతర పంటల సాగుకు ఎకరాకు ఏడాదికి రూ.2,100 చొప్పున రైతులకు చెల్లిస్తారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు మొక్కలు, డ్రిప్‌ పైపులు ఉచితం. తొమ్మిది ఎకరాల నుంచి 12 ఎకరాల విస్తీర్ణంలో పంట సాగు చేసే రైతులకు మొక్కలు, డ్రిప్‌ పరికరాలు 80శాతం రాయితీపై ఇవ్వనున్నారు.

గత ఏడాది లక్ష్యం 2,400 ఎకరాలు

సాగు చేసింది 4,500 ఎకరాల్లో

ఈ ఏడు టార్గెట్‌ 2,400 ఎకరాలు

పేర్లు నమోదు చేసుకున్న రైతులు 3,300 మంది

అధికారులు పెట్టుకున్న

లక్ష్యం 20వేల ఎకరాలు

పామాయిల్‌ పరిశ్రమకు

కేటాయించిన భూమి 30 ఎకరాలు

ఆయిల్‌ పామ్‌ సాగుపై అసక్తి ఉన్న రైతులు ఉద్యాన శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేయాలి. ఎకరాకు రూ.1,750 చొప్పున డీడీ తీసి ఇవ్వాలి. బోరు, నీటి వసతి ఉన్న రైతులు మాత్రమే అర్హులు. తాండూరు సమీపంలోని కోకట్‌ నర్సరీలో మొక్కలు అందుబాటులో ఉన్నాయి.

– సత్తార్‌, జిల్లా ఉద్యాన శాఖ అధికారి

జిల్లాలో లక్ష్యానికి మించి ఆయిల్‌ పామ్‌ సాగు

90శాతం సబ్సిడీపై మొక్కలు, డ్రిప్‌ పరికరాలు

రైతు వాటా ఎకరాకు రూ.1,750

ఎస్సీ, ఎస్టీలకు ఉచితం

ఆసక్తి చూపుతున్న అన్నదాతలు

ఆయిల్‌పామ్‌ దీర్ఘకాలిక పంట. సాగు చేసిన మూడున్నర ఏళ్ల నుంచి కాపునకు వస్తుంది. ఐదవ ఏట నుంచి 35 సంవత్సరాల పాటు ఏడాదికి 10 నుంచి 16 టన్నుల దిగుబడి వస్తుంది. ఈ లెక్కన ఏడాదికి రూ.2.5 లక్షల ఆదాయం రానుంది. ఎకరం పొలంలో 57మొక్కలు మాత్రమే నాటుకోవాలి. అంతర పంటలుగా శ్రీగంధం, సర్వి, ఉల్లి, మిరియాలు, పసుపు, కూరగాయల పంటలు సాగు చేసుకోవచ్చు. వీటి ద్వారా మరింత ఆదాయం వస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement