ఘనంగా నిర్వహిద్దాం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా నిర్వహిద్దాం

Aug 8 2026 8:43 AM | Updated on Aug 8 2026 8:43 AM

రైతులను

అప్రమత్తం చేయండి

స్వాతంత్య్ర దినోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేయండి

కలెక్టర్‌ దీపక్‌ తివారి

అనంతగిరి: స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ దీపక్‌ తివారి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో జిల్లాస్థాయి అధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వికారాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో ప్రధాన వేదిక, వీఐపీల గ్యాలరీ, వివిధ శాఖల స్టాళ్లు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. వర్షం పడే అవకాశం ఉన్నందున ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వరాదన్నారు. వేడుకల విజయవంతానికి అన్ని శాఖలు సమన్వయంలో పని చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం ప్రతి మండల కేంద్రంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించిందని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఉమాశంకర్‌ ప్రసాద్‌, వెంకటాచారి, అటవీ శాఖ జిల్లా అధికారి విశాల్‌ బత్తుల, డీఆర్‌డీఓ శ్రీనివాస్‌, ఏఓ ఫర్హీన బేగం తదితరులు పాల్గొన్నారు.

జిల్లా జనగణన

హ్యాండ్‌ బుక్‌తో ప్రయోజనం

జిల్లా జనగణన హ్యాండ్‌ బుక్‌ తయారీకి అవసరమైన అన్ని వివరాలు సేకరించాలని కలెక్టర్‌ దీపక్‌ తివారి అధికారులను ఆదేశించారు. శుక్రవారం నగరం నుంచి రాష్ట్ర జనగణన సంచాలకులు భారతి హోళ్లికేరి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జిల్లా జనగణన హ్యాండ్‌ బుక్‌ తయారీపై సూచనలు సలహాలు ఇచ్చారు. అనంతరం కలెక్టర్‌ దీపక్‌ తివారి జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. జిల్లా సమగ్ర సమాచారంతో హ్యాండ్‌ బుక్‌ తయారు చేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ వెంకటాచారి, సీసీఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా పడే అవకాశం ఉన్నందున రైతులను అప్రమత్తం చేయాలని కలెక్టర్‌ దీపక్‌ తివారి సూచించారు. శుక్రవారం నగరం నుంచి మంత్రులు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వానాకాలం సాగు, వన మహోత్సవం, పంట కుంటలు, స్మార్ట్‌ రేషన్‌ కార్డుల జారీపై సమీక్ష చేశారు. అనంతరం అధికారులతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. ఎల్‌నినో నేపథ్యంలో పంట మార్పిడి, ప్రత్యామ్నాయ పంటల సాగు, వనమహోత్సవం లక్ష్యాలపై ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement