బంట్వారం: టమాటా, ప చ్చిమిర్చికి గిట్టుబాటు ధర లభించడం లేదు. దీంతో పలువురు రైతులు పంట దిగుబడులను పొలంలోనే వదిలేస్తున్నారు. బంట్వా రం గ్రామానికి చెందిన పోచారం వెంకటేశం మూడున్నర ఎకరాల్లో టమాటా, మిర్చి పంటలు సాగు చేశాడు. అప్పు చేసి రూ.5 లక్షల పెట్టుబడి పెట్టాడు. పంట దిగుబడి చేతికి రావడంతో నగరంలోని వివిధ మార్కెట్లకు తరలించాడు. అక్కడ కనీస ధర కూడా పలకలేదని తెలిపాడు. మార్కెట్‌లో దళారులు సిండికేట్‌గా ఏ ర్పడి తక్కువ ధరకు టమాటా, పచ్చిమిర్చి కొనుగో లు చేస్తున్నారని ఆరోపించాడు. రవాణా ఖర్చులు కూడా రాలేదని వాపోయాడు. దీంతో పొలంలోనే పంటను వదిలేశానని కంటతడి పెట్టుకున్నాడు. పెట్టుబడి మొత్తం నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం అప్పులు మిగిలాయని, వడ్డీ కట్టలేని పరిస్థితితో ఉన్నట్లు తెలిపాడు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు వెంకటేశం కోరాడు.
● గిట్టుబాటు ధర రాక పొలంలోనే వదిలేసిన టమాటా పంట
● ఆందోళనలో రైతులు


