సిమెంట్‌ ఫ్యాక్టరీలో విద్యుత్‌ షాక్‌ | - | Sakshi
Sakshi News home page

సిమెంట్‌ ఫ్యాక్టరీలో విద్యుత్‌ షాక్‌

Aug 8 2026 8:37 AM | Updated on Aug 8 2026 8:37 AM

తాండూరు రూరల్‌: మండల పరిధిలోని మల్కాపూర్‌ గ్రామ శివారులో ఉన్న అల్ట్రాటెక్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీలో విద్యుత్‌ షాక్‌కు గురై ఇద్దరు రైల్వే కార్మికులు గాయపడ్డారు. ఈ సంఘటన శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. ఫ్యాక్టరీ సిబ్బంది, ఆస్పత్రి వర్గాల వివరాల ప్రకారం.. పట్టణంలోని రైల్వే కాలనీలో నివాసముంటున్న రాహుల్‌ రాథోడ్‌, కరుణాకర్‌ అల్ట్రాటెక్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీ హైటెన్షన్‌ విభాగంలో మెకానిక్‌లుగా పనిచేస్తున్నారు. ఎప్పటిలాగే విధులకు వెళ్లిన వీరు పనులు చేస్తుండగా షాక్‌కు గురయ్యారు. గమనించిన కార్మికులు వీరిని అంబులెన్స్‌లో తాండూరులోని జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నగరంలోని రైల్వే ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ విషయమై ఫ్యాక్టరీ హెచ్‌ఆర్‌ ప్రతినిధి శ్రీకాంత్‌ను అడగగా.. సిమెంట్‌ ఫ్యాక్టరీకి సంబంధించిన కార్మికులు కాదన్నారు. గూడ్స్‌ రైలుకు సంబంధించి రైల్వే కాంట్రాక్టర్‌ వద్ద పని చేస్తున్న కార్మికులని చెప్పారు.

ఇద్దరు రైల్వే కార్మికులకు గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement