పట్టాభూముల్లో ఎంజాయ్‌మెంట్‌ సర్వే | - | Sakshi
Sakshi News home page

పట్టాభూముల్లో ఎంజాయ్‌మెంట్‌ సర్వే

Aug 8 2026 8:37 AM | Updated on Aug 8 2026 8:37 AM

బొంరాస్‌పేట: దుద్యాల్‌ మండలం ఈర్లపల్లి, సండ్రకుంటతండా, నాన్యానాయక్‌తండాల్లో రెండో రోజు శుక్రవారం ఎంజాయ్‌మెంట్‌ సర్వే చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తగా పోలీసు బలగాల పహారాలో నిర్వహించారు. ఇండస్ట్రియల్‌ కారిడార్‌లో భూములు ఇస్తున్న బాధిత రైతులకు.. ప్రభుత్వం న్యాయం చేస్తుందని రెవెన్యూ అధికారులు తెలిపారు. 148 ఎకరాల్లో పట్టాభూముల్లో సర్వే చేశామని తహసీల్దార్‌ కిషన్‌నాయక్‌ తెలిపారు. సర్వే అనంతరం నెగోషియేషన్‌ కమిటీలో రైతుల పరిహారం నిర్ణయించడం జరగుతుందన్నారు. సర్వేలో నాలుగు బృందాలు పాల్గొన్నాయి. ఒక్కో బృందంలో తహసీల్దారు, సర్వేయర్‌, ఆర్‌ఐ, బీఎల్‌ఓల చొప్పున 16మంది అధికారులు తహసీల్దారు కిషన్‌నాయక్‌ ఆధ్వర్యంలో.. ప్రక్రియ నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement