టిప్పర్‌ ఢీకొని యువకుడి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

టిప్పర్‌ ఢీకొని యువకుడి దుర్మరణం

Aug 8 2026 8:37 AM | Updated on Aug 8 2026 8:37 AM

పహడీషరీఫ్‌: ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓ యువకుడిని టిప్పర్‌ వెనుక నుంచి ఢీకొనడంతో తీవ్ర గాయాలకు గురై అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన పహడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడప జిల్లాకు చెందిన యెద్దుల ఇంద్రారెడ్డి(23) నగరంలోని టీకేఆర్‌ కమాన్‌ వద్ద నివాసముంటూ ఆర్‌జీఐ విమానాశ్రయంలో టెక్నీషియన్‌గా విధులు నిర్వహి స్తున్నారు. కాగా ఇంద్రారెడ్డి శుక్రవారం తెల్లవారుజామున ఎల్‌బీనగర్‌ నుంచి ఆర్‌జీఐ విమానాశ్రయానికి ద్విచక్ర వాహనంపై వెళుతున్నారు. మార్గమధ్యలో విద్యాదయాని కళాశాల వద్ద రాగానే వెనుక నుంచి వేగంగా నిర్లక్ష్యంగా వచ్చిన టిప్పర్‌ ఢీకొట్టింది. ఈ సంఘటనలో తీవ్ర గాయాలైన ఇంద్రారెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement