దోమ: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం పీఆర్టీయూ నిరంతరం పోరాడుతుందని యూనియన్ మండల అధ్యక్షుడు ఆర్.కేశవులు, ప్రధాన కార్యదర్శి బి.ప్రవీణ్ సింగ్ అన్నారు. శుక్రవారం మండల పరిధి వివిధ పాఠశాలల్లో సభ్యత్వ నమోదు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి డి.అమర్నాథ్ మాట్లాడారు. సీపీఎస్ రద్దు చేసి, ఓపీఎస్ అమలు చేయాలని, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు ఓపీఎస్ పునరుద్ధరణ, పీఆర్సీని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధన నేపథ్యంలో సెప్టెంబర్ 1న చేపట్టనున్న ఉద్యమ కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కిష్టాపూర్ స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు లాల్య నాయక్, రాష్ట్ర బాధ్యులు గోపాల్, కుందేటి వెంకటయ్య, పాండు, జిల్లా బాధ్యులు వెంకట్ రెడ్డి, ఎల్లారెడ్డి, విజయ్ కుమార్, భీమ్య నాయక్, ప్రవీణ్ కుమార్, శ్రీశైలం, మండల బాధ్యులు వెంకటాచారి, సేవ్య నాయక్, సూరి, శ్రీనివాస్, అనంతయ్య, సత్యనారాయణ, యాదగిరి, మహబూబ్, కృష్ణ, సతీష్, రామచంద్ర రెడ్డి, చైతన్య, రాజ్ కుమార్, వెంకటేశ్ పాల్గొన్నారు.


