108కు తప్పుడు సమాచారం | - | Sakshi
Sakshi News home page

108కు తప్పుడు సమాచారం

Aug 8 2026 8:37 AM | Updated on Aug 8 2026 8:37 AM

ధారూరు: 108 సిబ్బందికి తప్పుడు సమాచారం ఇవ్వడంతో పాటు గ్రామానికి వెళ్లిన వారిపై ఓ మందుబాబు దాడికి పాల్పడిన ఘటన ధారూరు మండలం రాజాపూర్‌లో శనివారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన బంటు నర్సింహులు 108కు ఫోన్‌చేసి మా ఫ్రెండ్స్‌ కొట్టుకున్నారు, గాయాలయ్యాయి, వారిని ఆస్పత్రికి తరలించాలని చెప్పాడు. దీంతో దోమ, బొంరాస్‌పేట్‌ మండలాలకు చెందిన రెండు 108 వాహనాలు రాజాపూర్‌ చేరుకున్నాయి. గాయపడిన వారు ఎక్కడున్నారని కల్లు దుకాణంలో కూర్చుని తాగుతున్న నర్సింహులును ప్రశ్నించారు. తాగిన మైకంలో సిబ్బందిని నానా బూతులు తిడుతూ, ఈఎన్‌టీ నిఖిల్‌పై దాడిచేసి కొట్టాడు. రక్తగాయాలైన బాధితుడు ధారూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

మెడకింది భాగంలో గాయాలు

తొడకింది భాగంలో గాయం

రెండు అంబులెన్స్‌లతో వెళ్లిన సిబ్బందిపై మందుబాబు దాడి

కేసు నమోదు చేసిన ధారూరు పోలీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement