కొడంగల్: దుద్యాల మండలంలో ఏర్పాటు చేస్తున్న పారిశ్రామికవాడలో భూములు కోల్పోతున్న వారికి ప్రభుత్వం తగిన న్యాయం చేస్తుందని రెవెన్యూ అధికారులు అన్నారు. కలెక్టర్ దీపక్‌తివారి ఆదేశాల మేరకు గురువారం ఈర్లపల్లి, సండ్రకుంటతండా, నాన్యానాయక్‌తండాల్లో భూ ఎంజాయ్‌మెంట్ సర్వే నిర్వహించారు. నాలుగు బృందాలుగా ఏర్పడి 16మంది అధికారులు తహసీల్దార్ కిషన్‌నాయక్ ఆధ్వర్యంలో సర్వే చేశారు. కబ్జాలో ఉన్న పలువురు రైతులకు పట్టాలు లేవని, పట్టా ఉన్న కొంతమంది కబ్జాలో లేరని గుర్తించారు. సర్వే సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పరిగి డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు వంద మంది పోలీసులు బందోబస్తు విధులు నిర్వహించారు. సీఐ కొండల్‌రెడ్డి, ఎస్‌ఐలు శ్రీశైలం, సత్యనారాయణ, వేణుకుమార్, తహసీల్దార్లు మునీరొద్దీన్, విజయ్‌కుమార్, లక్ష్మీనారాయణ, స్థానిక డీటీ శివకుమార్, ఆర్‌ఐలు నవీన్, సంజయ్‌కుమార్, వెంకట్ రమణ, సుదర్శన్, గోవర్ధన్, సర్వేయర్లు మహేశ్, హేమలత, భాగ్యస్వాతి, మహేశ్, జీపీవోలు గోపాల్, రమేశ్, శ్రీనివాస్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


