నిబంధనలకు తూట్లు దౌల్తాబాద్ పీఏసీఎస్ కమిటీ పరిధిలోని షాపింగ్ కాంప్లెక్స్‌ల వ్యవహారం రోజుకో చర్చకు దారి తీస్తోంది.
● పునరావాస, పునర్నిర్మాణానికి కృషి
● భూ నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది
● కలెక్టర్ దీపక్ తివారి
కొడంగల్: రైతుల సంక్షేమానికి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తోందని కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. భూ నిర్వాసితులకు అండగా ఉంటూ పునరావాస, పునర్నిర్మాణానికి సహకారం అందిస్తున్నట్లు చెప్పారు. దుద్యాల మండలంలో టీజీఐసీ ఇండస్ట్రియల్ కారిడార్‌లో భాగంగా భూములు కోల్పోయిన రైతులకు బుధవారం ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. పట్టణంలోని ఓ పంక్షన్ హాల్‌లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ తిరుపతిరెడ్డితో కలిసి లగచర్ల, హకీంపేట, పోలేపల్లి గ్రామాల రైతులకు పట్టాలు అందజేశారు. హకీంపేటలో 288 మందికి, లగచర్లలో 227 మందికి, పోలేపల్లిలో 38 మందికి పట్టాలు ఇచ్చినట్లు కలెక్టర్ చెప్పారు. ఈ మూడు గ్రామాల పరిధిలో పలు అభివృద్ధి పనులకు 1,358 ఎకరాల భూమిని సేకరించించినట్లు తెలిపారు. అందరి సహకారంతో ఇంటిగ్రేటెడ్ స్కూల్, ఎడ్యూకేషన్ హబ్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. త్వరలో ఇండస్ట్రియల్ పార్కు వస్తుందన్నారు. హైదరాబాద్ – కొడంగల్ రేడియల్ రోడ్డుకు సహకరించాలన్నారు.
రైతులకు ధన్యవాదాలు
అభివృద్ధికి సహకరించి భూములు ఇచ్చిన రైతులకు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ తిరుపతిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ ప్రాంత అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు. భూములు కోల్పోయిన రైతులందరినీ ఆదుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్పీ స్నేహమెహ్ర, అదనపు కలెక్టర్ వెంకటాచాని, అదనపు ఎస్పీ రాజేష్‌మీన, తాండూరు ఆర్‌డీఓ అనిత, కొడంగల్ మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ గుప్తా, ఏఎంసీ చైర్మన్ అంబయ్య గౌడ్, హకీంపేట, పోలేపల్లి, లగచర్ల సర్పంచులు రవీంద్ర నర్సింహారెడ్డి, జింకల చంద్రయ్య, వెంకట్రాములు గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆవుటి శేఖర్, మున్సిపల్ కౌన్సిలర్ కృష్ణంరాజు, తహసీల్దార్ కిషన్, ఎంపీడీఓ జైపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఉద్యాన పంటల సాగుకు చర్యలు
కొడంగల్ రూరల్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో ఉద్యాన, పట్టు పరిశ్రమల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ దీపక్‌తివారి తెలిపారు. బుధవారం పట్టణంలోని కడా కార్యాలయంలో ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి అధ్యక్షతన వ్యవసాయ రంగంపై చర్చించారు. ప్రముఖ పరిశోధనా సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, భారత ప్రభుత్వ సంస్థలు, శాస్త్రవేత్తలు, నిపుణుల బృందాలు పాల్గొన్నాయి. పంట ఉత్పత్తి విధానాలు, ఉద్యాన పంటల అభివృద్ధి, సహజ వనరుల నిర్వహణ, సాగునీటి వనరులు, మార్కెట్ అనుసంధానం, ఆహార ప్రొసెసింగ్, రైతు సంస్థలు, అనుబంధ వ్యవసాయ రంగాలపై చర్చించారు. ఇక్రిశాట్ సీనియర్ సైంటిస్ట్, నిపుణుల బృందం చైర్మన్ డాక్టర్ హరికిషన్ చిట్లపల్లిలో పర్యటించారు. అక్కడి కొడంగల్ ఫార్మర్ సర్వీస్ ప్రొడ్యూసర్ కంపెనీని సందర్శించారు. వికారాబాద్, నారాయణపేట జిల్లాల పర్యటన వివరాలు, తమ సిఫార్సులతో కూడిన సమగ్ర నివేదికలను ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటి డైరెక్టర్ డీఏఓ, ఏడీ ఉద్యాన శాఖ జేడీ శ్రీబాబు, హార్టీకల్చర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డా. ఏ భగవాన్, డీహెచ్‌ఎస్‌ఓ ఎంఏ సత్తార్, పట్టు పరిశ్రమ జేడీ లత, డీఆర్‌డీఏ కొడంగల్ హెచ్‌ఓ సురేంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.


