బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా రమేష్‌కుమార్‌ | - | Sakshi
Sakshi News home page

బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా రమేష్‌కుమార్‌

Aug 6 2026 8:08 AM | Updated on Aug 6 2026 8:08 AM

బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా రమేష్‌కుమార్‌ గురుకులంలో ఇంటర్‌ స్పాట్‌ అడ్మిషన్లు కలిసి పని చేద్దాం.. లాభాలు గడిద్దాం

తాండూరు: బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా యూ రమేష్‌కుమార్‌ నియమితులయ్యారు. బుధవారం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఎన్‌ గౌతమ్‌రావు ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. తాండూరు నియోజకవర్గం నర్సాపూర్‌ గ్రామానికి చెందిన రమేష్‌కుమార్‌ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పని చేశారు. గతంలో పీఏసీఎస్‌ డైరక్టర్‌గా పని చేశారు. ఆ తర్వాత బీజేపీలో చేరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా సేవలందించారు. ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి ప్రధాన అనుచరుడిగా పేరుంది. జిల్లా అధ్యక్ష పదవికి ముగ్గురు పోటీ పడగా పార్టీ అధిష్టానం రమేష్‌కుమార్‌కు బాధ్యతలు అప్పగించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. తన నియామకానికి సహకరించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావుకు, కేంద్ర మంత్రులు, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

తాండూరు టౌన్‌: పట్టణంలోని ఎన్టీఆర్‌ నగర్‌ సమీపంలో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ (బాలుర – పెద్దేముల్‌) గురుకుల కళాశాలలో ఇంటర్‌లో స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ అశోక్‌ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపీసీ గ్రూపులో 12, బైపీసీలో 10 సీట్లు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. అర్హులైన విద్యార్థులు నేటి నుంచి 9వ తేదీ వరకు నిర్వహించే స్పాట్‌ అడ్మిషన్‌కు, అర్హత, ధ్రువపత్రాలతో హాజరు కావాలని కోరారు.

బూర్గుపల్లి గురుకులంలో..

అనంతగిరి: వికారాబాద్‌ మండలం బూర్గుపల్లి గురుకుల పాఠశాల, కళాశాల(బాలికలు)లో ఇంటర్‌ మొదటి సంవత్సరం ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో ఖాళీల భర్తీ కోసం స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్టు ప్రిన్సిపాల్‌ ఉషాకిరణ్‌ తెలిపారు. ఈ నెల 7వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు స్పాట్‌ అడ్మిషన్లు ఉంటాయని తెలిపారు. 2026లో పదో తరగతితో ఉత్తీర్ణులైన బాలికలు మాత్రమే అర్హులన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థినులు అన్ని సర్టిఫికెట్లతో హాజరు కావాలని కోరారు.

కొడంగల్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో..

కొడంగల్‌ రూరల్‌: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం నుంచి 11వ తేదీ వరకు దోస్త్‌ ద్వారా డిగ్రీ స్షెషల్‌ ఫేజ్‌ అడ్మిషన్ల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వెబ్‌ ఆప్షన్స్‌ ఎంపిక ప్రారంభమవుతుందని ప్రిన్సిపాల్‌ డా. బీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. దోస్త్‌ చివరి దశలో చేరిన విద్యార్థులకు సైతం స్కాలర్‌ షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తిస్తుందని తెలిపారు. కళాశాలలో బీఏ, బీకామ్‌, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌, బీఎస్సీ బీజెడ్‌సీ, ఎంపీసీ, ఎంపీసీఎస్‌, బీఎస్సీ హెల్త్‌కేర్‌ కోర్సుల్లో సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఇతర వివరాలకు కళాశాల కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

ఆర్టీసీ రంగారెడ్డి రీజినల్‌ మేనేజర్‌ శ్రీదేవి

వికారాబాద్‌ డిపో వద్ద గేట్‌ మీటింగ్‌

అనంతగిరి: నష్టాల్లో ఉన్న డిపోను లాభాల్లోకి తీసుకురావడానికి డిపో కార్మికులు, ఉద్యోగులు సమష్టిగా కృషి చేయాలని ఆర్టీసీ రంగారెడ్డి రీజినల్‌ మేనేజర్‌ శ్రీదేవి సూచించారు. బుధవారం ఆమె వికారాబాద్‌ డిపోను సందర్శించారు. ఉద్యోగులతో గేటు మీటింగ్‌ నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రూ.1.50 కోట్ల నష్టాల్లో ఉన్న వికారాబాద్‌ డిపోను అందరం సమర్థవంతంగా పనిచేసి లాభాల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రతి ఉద్యోగి మరింత బాధ్యతగా పనిచేయాలని సూచించారు. పెయి డ్‌ ప్యాసింజర్‌ను పెంచుకోవాలని, స్పెషల్‌ హైర్‌ బుకింగ్స్‌ పెంచుకోవాలని యాత్ర దానం స్పెషల్‌ బుకింగ్‌ లాంటిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అనంతరం డిపో ప్రాంగణంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో డిప్యూటీ ఆర్‌ఎంఓ సరస్వతి, వికారాబాద్‌ డీఎం నమ్రత, షెడ్యూల్‌ సీఐ కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement