ఢిల్లీ ధర్నాలో విదేశీ శక్తులు | - | Sakshi
Sakshi News home page

ఢిల్లీ ధర్నాలో విదేశీ శక్తులు

Jul 26 2026 8:00 AM | Updated on Jul 26 2026 8:00 AM

ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

అనంతగిరి: ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద నిర్వహించిన ధర్నాలో విద్యార్థులకన్నా ఇతరులే ఎక్కువగా ఉన్నారని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. ఈమేరకు శనివారం ఆయన వికారాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ధర్నాలో దేశాన్ని విచ్ఛిన్నం చేసే విదేశీ శక్తులే ఉన్నాయన్నారు. అక్కడ ధర్నా శాంతియుతంగా చేయకపోవడంతో పాటు బారికేడ్లు దాటుకుని వచ్చారన్నారు. కాక్రోచ్‌ పార్టీ అమెరికాలో పుట్టిందని, దీన్ని సృష్టించింది ఒక సోషల్‌ మీడియా కన్సల్టెంట్‌ అని తెలిపారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ నేరుగా సమీక్షిస్తున్నారని స్పష్టంచేశారు. మోదీకి విద్యార్థులపై నమ్మకం ఉందని తెలిపారు. పేపర్‌ లీకై న వెంటనే ఆయన పరీక్షను రద్దు చేశారన్నారు. వికారాబాద్‌లో బీజేపీ నాయకులపై జరిగిన దాడిని ఖండిస్తున్నామని తెలిపారు. ఆయన వెంట బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు కరణం ప్రహ్లాద్‌రావు, మాధవరెడ్డి, అసెంబ్లీ కోఆర్డినేటర్‌ వడ్ల నందు, శ్రీధర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement