షాబాద్: ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిల తల్లి పట్నం రుక్కమ్మ అంత్యక్రియలను ఆమె స్వగ్రామమైన గొల్లూరుగూడలో శనివారం పూర్తిచేశారు. మాజీ మంత్రులు సబితారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, చంద్రశేఖర్, బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు నవీన్‌కుమార్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, ఏవీన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మనోహర్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, వీర్లపల్లి శంకర్, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ ఎంపీ రంజిత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అంజయ్యయాదవ్, మహేశ్‌రెడ్డి, మెతుకు ఆనంద్, కేఎస్ రత్నం, జైపాల్‌యాదవ్, కేఎల్లార్, ప్రతాప్‌రెడ్డి, అల వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు నాగేందర్‌గౌడ్, వెంకటేశ్వర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, నాయకులు కార్తీక్‌రెడ్డి, కౌశిక్‌రెడ్డి తదితరులు రుక్కమ్మ మృతదేహం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు.


