చేవెళ్ల: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వం అందించే యూనిఫాంలు, షూ, సాక్స్‌లు వచ్చేశాయి. శనివారం మండల విద్యావనరుల కేంద్రానికి చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఎంఈఓ పురన్‌దాస్ పరిశీలించి మాట్లాడారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో యూనిఫాంలు, షూ, సాక్స్, వసతి గృహంలోని విద్యార్థులకు టవల్స్, బెడ్‌షీట్స్, కార్పెట్లు మండలాలకు సరఫరా అయ్యాయన్నారు. మండలంలోని మొత్తం 65 పాఠశాలలకు సంబంధించి మొత్తం 4,229 మంది విద్యార్థులు యూనిఫాంలు వచ్చాయన్నారు. ఆగస్టు 15 నాటికి యూనిఫాంలను అందించాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలిపారు.


