డీపీఓ జయసుధ
తాండూరు రూరల్: ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని డీపీఓ జయసుధ అన్నారు. మంగళవారం పెద్దేముల్ మండలం రుక్మాపూర్, కందనెల్లి గ్రామాల్లో సర్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్యూమరేషన్ ఫారాలు పూర్తి చేసిన తర్వాత డిజిటలైజేషన్ చేయాలని ఆదేశించారు. ఎలాంటి తప్పులకు అవకాశం ఇవ్వరాదన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకట్ ప్రసాద్, ఎంపీడీఓ తిరులమస్వామి, ఎంపీఓ రతన్‌సింగ్, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.


