● రూ.368.30 కోట్లతో మరమ్మతులు
● రేపు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన
పరిగి: గ్రామీణ రోడ్ల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మెరుగైన రవాణా సదుపాయం కోసం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మరమ్మతులు, బీటీ రోడ్లు, విస్తరణ, వంతెనల నిర్మాణం కోసం భారీగా నిధులు కేటాయించింది. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో రోడ్ల మరమ్మతులకు రూ.368.30 కోట్లు విడుదల చేసింది. చిట్టెంపల్లి నుంచి లాల్‌పహాడ్ వరకు 14.70 కిలో మీటర్ల రోడ్డుకు మరమ్మతులు చేయనున్నారు. కుల్కచర్ల – నల్లార్లగుట్ట(13.40 కి.మీ.), కుల్కచర్ల – దాదాపూర్(8.60 కి.మీ.), జాఫర్‌పల్లి – ముజాహిద్‌పూర్(12.80కి.మీ.), బాపల్లితండా – బడెంపల్లి గేట్(3.5 కి.మీ.), చౌడాపూర్ – లాల్‌పహాడ్ మిస్సింగ్ లింక్ రోడ్డు(4 కి.మీ.), సుల్తాన్‌పూర్ – దోమ మండలం బాస్‌పల్లి వరకు( 13.80కి.మీ.), పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి రూప్‌ఖాన్‌పేట్ వరకు(1.40 కి.మీ.), పీడబ్ల్యూడీ రోడ్డు – సయ్యాద్‌మల్కాపూర్ వరకు 0.50(కి.మీ.), పీడబ్ల్యూడీ రోడ్డు – బర్కత్‌పల్లి వరకు(1.45 కి.మీ.), పీడబ్ల్యూడీ రోడ్డు – లక్ష్మీదేవిపల్లి వరకు(2.50 కి.మీ.), పీడబ్ల్యూడీ రోడ్డు –నిజాంపేట్ మేడిపల్లి వరకు(1.50 కి.మీ.), పీడబ్ల్యూడీ రోడ్డు – మీర్జాపూర్ వరకు(కిలో మీటరు), పీడబ్ల్యూడీ రోడ్డు – తిమ్మాపూర్, కొత్తపల్లి వరకు(3.60 కి.మీ.), మన్నెగూడ రోడ్డు – తిరుమలపూర్ వరకు(2.50 కి.మీ.), పీడబ్ల్యూడీ రోడ్డు – బండమీదితండా, లాల్‌సింగ్‌తండా వరకు(3.50 కి.మీ.), పీడబ్ల్యూడీ రోడ్డు – అనంతసాగర్ వరకు(3 కి.మీ.), పీడబ్ల్యూడీ రోడ్డు– మక్తవెంకటాపూర్‌తండా వరకు(4 కి. మీ.), అల్లాపూర్‌తండా – చాకల్‌పల్లితండా వరకు(2.40 కి.మీ.), బొంపల్లి – దోమ వయా పెద్దతండా వరకు(5.60 కి.మీ.), మోత్కూర్ పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి పాలేపల్లి వరకు(2.10 కి.మీ.), పీడబ్ల్యూడీ రోడ్డు – శివారెడ్డిపల్లి వరకు(1.13 కి.మీటర్లు) మరమ్మతు పనులు చేపట్టనున్నారు.
మంత్రి చేతుల మీదుగా..
ఈ నెల 16న ఆయా రోడ్ల మరమ్మతు పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. నిధుల మంజూరుకు స్థానిక ఎమ్మెల్యే టీ రామ్మోహన్‌రెడ్డి ప్రత్యేక కృషి చేశారు. త్వరలో టెండరప్రక్రియను పూర్తి చేసి పనులను ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.
ప్రతి గ్రామానికీ రోడ్డు
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి తండా, ప్రతి పల్లెకు బీటీ రోడ్డు వేస్తాం. మొదటి విడతలో రూ.368.30 కోట్లు మంజూరయ్యాయి. మిగిలిన గ్రామాలకు కూడా రోడ్లు వేస్తాం. ఇప్పటికే నియోజకవర్గంలో రూ.50 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేశాం.
– టి.రామ్మోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే, పరిగి


