సీఎం రేవంత్‌రెడ్డిపై కొడంగల్‌ పీఎస్‌లో ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

సీఎం రేవంత్‌రెడ్డిపై కొడంగల్‌ పీఎస్‌లో ఫిర్యాదు

Jul 15 2026 11:59 AM | Updated on Jul 15 2026 11:59 AM

కొడంగల్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మంగళవారం బీఆర్‌ఎస్‌ నాయకులు కొడంగల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ సత్యనారాయణకు లిఖితపూర్వంగా ఫిర్యాదు అందజేశారు. మాజీ సీఎం కేసీఆర్‌ కుటుంబం, రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. లేని పక్షంలో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన లు, ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. బీఆర్‌ఎస్‌ అధినేతపై కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న వ్యా ఖ్యలను ఖండించారు. కార్యక్రమంలో పార్టీ మండల మాజీ అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్‌ మధుయాదవ్‌, ఎరన్‌పల్లి శ్రీనివాస్‌, మల్లేశ్‌, బాల్‌రాజ్‌, మోహన్‌, మహ్మద్‌ రఫీ, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సీపీఎస్‌ను వెంటనే

రద్దు చేయాలి

ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్‌

కొడంగల్‌: కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానాన్ని వెంటనే రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్‌ అన్నారు. మంగళవారం మండలంలోని పలు పాఠశాలల్లో ఎస్టీయూ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జూలై 15న ఉద్యోగ ఉపాధ్యాలయులకు సీఎం చేతుల మీదుగా హెల్త్‌కార్డులు జారీ చేస్తారని తెలిపారు. త్వరలో పీఆర్‌సీ నివేదికను ప్రభుత్వం అమలు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను ప్రభుత్వం ప్రకటించాలన్నారు. జీపీఎఫ్‌, జీఎల్‌ఐఎస్‌, మెడికల్‌ బిల్లులు చెల్లించాలన్నారు. పెన్సనర్లకు రావాల్సిన పెండింగ్‌ బకాయిలు ఇవ్వాలన్నారు. ఉపాధ్యాయులకు పదోన్నతులతో కూడిన బదిలీలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలలను మూసివేసే ఆలోచనను విరవించుకోవాలన్నారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసి, పేద విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో విష్ణుకుమార్‌, ఆశప్ప తదితరులు పాల్గొన్నారు.

అన్నదాతలను ఆదుకోవాలి

మెట్ట పంట ఎకరాకు రూ.8 వేలు ఇవ్వాలి

రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి పశ్య పద్మ

కలెక్టరేట్‌ ఎదుట ధర్నా

అనంతగిరి: తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా నష్టపోయిన అన్నదాతలను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి పశ్యపద్మ డిమాండ్‌ చేశారు. మంగళవారం కలెక్టర్‌ ఎదుట సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అదనపు కలెక్టర్‌ వెంకటాచారికి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎల్‌నినో కారణంగా తక్కువ వర్షపాతం నమోదైందన్నారు. వరికి ప్రత్యామ్నాయంగా మెట్ట పంటలను ప్రోత్సహించేందుకు ఎకరాకు రూ.8 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆశించిన మేర వానలు పడకపోవడంతో విత్తనం వేసిన రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. దాదాపు 30 శాతం విత్తనాలు మొలకత్తలేదన్నారు. మెట్ట పంటకు అవసరమయ్యే విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి గంటి సురేష్‌ కుమార్‌, ఏఐటీయూసీ నాయకులు విజయలక్ష్మి పండిత్‌, పీర్‌ ముహమ్మద్‌, అనంతయ్య, విమలమ్మ, సావిత్రమ్మ, బాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement