తేరుకోని షాక్‌బాద్‌ | - | Sakshi
Sakshi News home page

తేరుకోని షాక్‌బాద్‌

Jul 13 2026 8:15 AM | Updated on Jul 13 2026 8:15 AM

అన్నదాతలు ‘వర్రీ’ వర్షాకాలం ప్రారంభమై సుమారురెండు నెలలు గడుస్తున్నా చెప్పుకోదగినవర్షం పడలేదు. సోమవారం శ్రీ 13 శ్రీ జూలై శ్రీ 2026 8లోu

న్యూస్‌రీల్‌

బాధిత కుటుంబాలకు పరామర్శల వెల్లువ

అన్నదాతలు ‘వర్రీ’ వర్షాకాలం ప్రారంభమై సుమారురెండు నెలలు గడుస్తున్నా చెప్పుకోదగినవర్షం పడలేదు.

సాక్షి, రంగారెడ్డిజిల్లా: అరగంట వ్యవధిలో ఆరు హత్యలతో అట్టుడికిన ఆ ప్రాంతం ఇప్పటికీ షాక్‌ నుంచి తేరుకోలేదు. కిరాతకుడి చేతిలో దారుణ హత్యకు గురైన ఆ రెండు కుటుంబాలు కంటిమీద కునుకు లేకుండా నిత్యం భయంభయంగా గడుపుతున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి ఆరు హత్యలతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన షాబాద్‌, దైవాలగూడ గ్రామాలు ఆదివారం కూడా నివురుగప్పిన నిప్పులా కన్పించాయి. నరమేధానికి పాల్పడిన నరరూప రాక్షసుడిని పోలీసులు ఇప్పటికీ అరెస్ట్‌ చేయకపోవడంతో స్థానికులు, వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు.. ఏ రూపంలో వచ్చి.. మళ్లీ ఏం చేస్తాడోనని అంతా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. స్థానికంగా ఏ ఇద్దరు కలిసినా.. నిందితుడు రాజ్‌కుమార్‌ వ్యవహార శైలిపైనే చర్చించుకోవడం కన్పించింది. మరోవైపు రెండు గ్రామాల్లో పోలీసు పహారా కొనసాగుతోంది. పెద్ద సంఖ్యలో బందోబస్తు నిర్వహిస్తున్నారు.

చిగురుటాకులా వణికిన షాబాద్‌, దైవాలగూడ

చర్చనీయాంశంగా ఆరు హత్యలు

ఏ ఇద్దరు కలిసినా ఇదే టాపిక్‌

ప్రముఖుల పరామర్శలు, నివాళులతో హడావుడి

కొనసాగుతున్న పోలీస్‌ పహారా

బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు, మృతులకు నివాళి అర్పించేందుకు ఆదివారం పలువురు ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీల నేతలు, ప్రజాసంఘాల నాయకులు పెద్ద ఎత్తున గ్రామానికి తరలివచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎటు చూసినా హడావుడి కనిపించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement