అనంతగిరి: ఉమ్మడి రంగారెడ్డిలోని ప్రభుత్వ డైట్ కళాశాలల్లో బోధించేందుకు ఉమ్మడి జిల్లా పరిధిలోని ఇన్‌సర్వీస్ టీచర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ అబ్దుల్ ఘని ఓ ప్రకటనలో తెలిపారు. ఆర్ట్, ఫిజికల్ ఎడ్యూకేషన్, ఎడ్యూకేషనల్ టెక్నాలజీ, ఇంగ్లిష్, సైకాలజీ, తెలుగు, ఇంగ్లిష్ సబ్జెక్టుల బోధనకు తెలుగు, ఆంగ్ల మాధ్యమంలో, గణితం, ఫిలాసఫీ, సోషియాలజీ, సైన్స్, సాంఘిక శాస్త్రం, ఉర్దూ సబ్జెక్టుల బోధనకు తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మాధ్యమంలో బోధించే వారు ఈ నెల 14వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 79950 87606 నంబర్‌లో సంప్రదించాలన్నారు.
తాండూరు రూరల్: హ్యామ్ నమూనా రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం పెద్దేముల్ మండలానికి రూ.185 కోట్లు మంజూరు చేసింది. ఈ నెల 16న రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హాజరై ఈ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ వర్గాలు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపాయి. కార్యక్రమ ఏర్పాట్లకు సంబంధించి ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో పెద్దేముల్ మండల పరిధిలోని సర్పంచ్‌లు, కాంగ్రెస్ నాయకులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఉద్యానశాఖ అధికారి సంతోశ్ కుమార్
దోమ: హార్టికల్చర్ పునరుజ్జీవ పథకం ద్వార 15 ఏళ్లు పైబడిన మామిడి చెట్ల కొమ్మలను రాయితీపై కత్తిరిచేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని ఉద్యానశాఖ అధికారి సంతోశ్ కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. పరిగి నియోజకవర్గంలో 2.5 ఎకరాలకు పైన మామిడి తోటలు ఉన్న రైతులు చెట్ల కొమ్మలను కత్తిరించాలనుకుంటే ఆపరేటేడ్ చైన్‌సా–1, ప్రూనర్–2, కత్తెరలు–2, లూపర్–1 తెచ్చుకోవాలన్నారు. వీటి విలువ మార్కెట్‌లో జీఎస్టీతో కలిపి రూ.12,500 ఉంటుందన్నారు. రైతులకు ప్రభుత్వం నుంచి రూ.24 వేలు సబ్సిడీ అందుతుందని చెప్పారు. ఆసక్తి గల రైతులు తమ తమ పాస్‌బుక్, ఆధార్‌కార్డు, బ్యాంకుఖాతా జిరాక్స్, పాస్‌ఫొటోతో జతచేసి తమకు అందిస్తే సబ్సిడీ వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. హార్టికల్చర్ ఆఫీసర్ సంతోశ్ 89777 14209, పరిగి, పూడూర్ హెచ్‌ఈఓ రాజేందర్ 72869 46657, దోమ, కుల్కచర్ల, చౌడాపూర్ మండలాల హెచ్‌ఈఓ రాంరెడ్డి 63027 59351 నంబర్లలో సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చన్నారు.
మీర్‌పేట: డ్రగ్స్ రహిత నగరంగా మార్చేందుకు ప్రతి పౌరుడు పాటుపడాలని ఈగల్ ఫోర్స్ హైదరాబాద్ అవేర్‌నెస్ వింగ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. యువ టీం ఆధ్వర్యంలో ఆదివారం 59వ డివిజన్ టీకేఆర్ బస్టాండ్ వద్ద ప్రారంభమైన 3కే యాంటీ డ్రగ్ అవేర్‌నెస్ మారథాన్‌కు మాజీ కార్పొరేటర్లు అనిల్‌యాదవ్, రాజ్‌కుమార్‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డ్రగ్స్, గంజాయిని పూర్తిగా నిర్మూలించేందుకు యువత ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు, పోలీసు వ్యవస్థ కలిసి పోరాడితే తప్ప డ్రగ్స్ మహమ్మారిని పారద్రోలలేమన్నారు. కార్యక్రమంలో టీం యువ అధ్యక్షుడు వెంకటేశ్, ఉపాధ్యక్షుడు అచ్యుతానంద, యాంటీ క్రూసైడ్ సొసైటీ ఎస్‌ఐ పవన్‌కుమార్‌రెడ్డి, రెస్లింగ్ కోచ్ ప్రశాంత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
తుక్కుగూడ: డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చినా ఎలాంటి మౌలిక వసతులు లేవని, తాము ఎలా ఉండాలని మంఖాల్ డబుల్‌బెడ్ రూమ్ లబ్ధిదారులు ఆదివారం నిరసన వ్యక్తం చేశా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వసతులు లేకపోవడంతో తాము పూరిగుడిసెలు, అద్దె ఇళ్లలో నివాసం ఉంటున్నామని అన్నారు. తమకు ఇచ్చిన ఇళ్లు శిథిలావస్థకు చేరుకోక ముందే, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. నిరసనకు మంఖాల్ జీహెచ్‌ఎంసీ డివిజన్ బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. మాజీ కౌన్సిలర్ బాకి విలాస్, నాయకులు శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.


