మందకొడిగా ఎస్‌ఐఆర్‌ | - | Sakshi
Sakshi News home page

మందకొడిగా ఎస్‌ఐఆర్‌

Jul 13 2026 8:15 AM | Updated on Jul 13 2026 8:15 AM

జిల్లాలో గణాంకాలు

తిరిగి ఇవ్వకపోవడంతోనే..

బషీరాబాద్‌: సర్‌ ప్రక్రియ నత్తనడకన కొనసాగుతోంది. ఎన్యూమరేషన్‌ ఫారాల పంపిణీలో జిల్లా యంత్రాంగం దాదాపు లక్ష్యాన్ని చేరుకున్నా డిజిటలైజేషన్‌ పరక్రియ ఆశించన స్థాయిలో ముందుకు సాగడం లేదు. ఈ నెల 24న గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో అధికారులు, సిబ్బంది సెలవురోజుల్లోనూ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నా డిజిటలైజేషన్‌ పక్రియ 37.52 శాతం మాత్రమే నమోదు కావడం అధికార యంత్రాంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

భారమంతా రెవెన్యూపైనే

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను రెవెన్యూ యంత్రాంగం ముందుండి నడిపిస్తోంది. ఆ శాఖలోని అటెండర్లు మొదలుకుని జిల్లా స్థాయి రెవెన్యూ అధికారి వరకు ఎస్‌ఐఆర్‌ విధుల్లోనే నిమగ్నమయ్యారు. పంచాయతీ కార్యదర్శులు, అంగన్‌వాడీ టీచర్లు, బీఎల్‌ఓలు క్షేత్రస్థాయిలో ఇంటింటికీ వెళ్లి ఫారాలు పంపిణీ చేస్తున్నప్పటికీ సకాలంలో ఆన్‌లైన్‌లో నమోదు చేయలేకపోతున్నారు. మరోవైపు అనేక గ్రామాల్లో సర్పంచ్‌లు, వివిధ పార్టీల రాజకీయ నేతలు స్వయంగా చొరవ తీసుకుని చదువుకున్న యువత సహకారంతో ఓటర్లకు ఫారాలు నింపించి వారే ఆన్‌లైన్‌లోనూ నమోదు చేస్తున్నారు.

ముందుకురాని వలస ఓటర్లు

ఉపాధి, ఉద్యోగాల కోసం హైదరాబాద్‌, ముంబాయి, పూణే వంటి నగరాలకు వలస వెళ్లిన వలస ఓటర్ల నుంచి ఆశించిన స్పందన లేకపోవడంతో నమోదు ప్రక్రియ మరింత మందగిస్తోంది. ఫారాలు పంపిణీ చేసినప్పటికీ వేలాది మంది ఓటర్లు తిరిగి ఇవ్వడంలేదని తెలుస్తోంది. ఇప్పటి వరకు సేకరించిన వాటిని పరిశీలించి పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉండటంతో కా ర్యాలయాల వద్ద ఫారాలు పేరుకుపోతున్నాయి. డేటా నమోదు వేగం పెరగకపోతే చివరి రోజుల్లో అధికార యంత్రాంగంపై ఒత్తిడి పడే అవకాశం ఉంది. ప్రస్తుతం జిల్లాలో డిజిటలైజేషన్‌ మూడో వంతు మాత్రమే పూర్తవడం, గడువు సమీపిస్తుండడం అధికారులకు సవాల్‌గా మారింది. నమోదు వేగాన్ని పెంచకపోతే లక్ష్య సాధన కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

నియోజకవర్గం ఓటర్లు ఫారాల పంపిణీ డిజిటలైజేషన్‌ శాతం

పరిగి 2,76,260 2,76,095 103610 37.50

వికారాబాద్‌ 2,37,921 237920 94,476 39.71

తాండూరు 25,22,35 2,51,112 88,174 34.96

కొడంగల్‌ 2,51,255 2,48,990 95,571 38.04

డిజిటలైజేషన్‌లో జాప్యం

ఓటర్ల దగ్గరే 6,32,286 ఎన్యూమరేషన్‌ ఫారాలు

ముంచుకొస్తున్న గడువు

అధికారులపై పెరుగుతున్న పని ఒత్తిడి

జిల్లాలో మొత్తం 10,17,671 మంది ఓటర్లు ఉండగా, వారిలో 10,14,117 ఓటర్లకు ఎన్యూమరేషన్‌ ఫారాలు పంపిణీ చేశారు. ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు జిల్లాలో 3,81,831 ఫారాలు మాత్రమే డిజిటలైజేషన్‌ పూర్తయ్యాయి. అంటే పంపిణీ పూర్తయిన ప్రతీ మూడు ఫారాల్లో ఒకటి మాత్రమే డిజిటల్‌ రూపంలో నమోదైంది. ఇంకా 6,32,286 మంది ఓటర్లు తమ ఎన్యూమరేషనషన్‌ ఫారాలను బీఎల్‌ఓలకు ఇవ్వకపోవడంతో డిజిటలైజేషన్‌ జాప్యానికి కారణంగా తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement