మీ డబ్బు.. మీ హక్కు
అనంతగిరి: కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన ‘మీ డబ్బు.. మీ హక్కు’ అనే కార్యక్రమం ద్వారా ఖాతాదారులు అన్ క్లైమ్డ్ సొమ్మును తిరిగి పొందేందుకు అవకాశం ఉంటుందని అడిషనల్ కలెక్టర్ లింగ్యా నాయక్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్యాంకులు, బీమా సంస్థలు, పోస్టాఫీసుల్లో క్లైమ్డ్ చేసుకోని సొమ్మును తిరిగి పొందేందుకు ప్రభుత్వం మీ డబ్బు మీ హక్కు అనే కార్యక్రమం చేపట్టిందన్నారు. జిల్లాలోని వివిధ బ్యాంకుల్లో 1,48,511 ఖాతాల్లో 30.44 కోట్ల రూపాయల అన్ క్లైమ్డ్ సొమ్ము ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా 184 ఖాతాల్లోని 1.60 కోట్ల రూపాయలను సంబంధిత ఖాతాదారులు తిరిగి పొందారని తెలిపారు. ప్రజల సొమ్మును వారికే చేరాలనే ఉద్దేశంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐఆర్‌డీఏఐ, పీఎఫ్‌ఆర్‌డీఏ, డీఎఫ్‌ఎస్ వంటి జాతీయ స్థాయి సంస్థలు, బ్యాంకులు, బీమా సంస్థలు ఉమ్మడిగా ఈ శిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సుధీర్, డీఆర్‌ఓ మంగీలాల్, ఎల్‌డీఏం యాదగిరి, ఆర్‌బీఐ ఏజీఎం చేతన్ గోరేఖర్, యూబీఐఎస్‌బీ, తెలంగాణ గ్రామీణ బ్యాంక్, హైదరాబాద్ కో ఆపరేటివ్ బ్యాంక్ అధికారులు, జీవిత బీమా సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
సజావుగా ధాన్యం సేకరించాలి
ధారూరు: రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు చేయాలని అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ ఆదేశించారు. మంగళవారం మండలంలోని గట్టెపల్లిలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు తరలించాలని సూచించారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో గోనె సంచులు అందుబాటులో ఉంచాలన్నారు. రైతులు తెచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందేనని, వెనక్కు పంపరాదని ఆదేశించారు. రైతులు దళారులను నమ్మి నష్టపోరాదని, కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే మద్దతు ధర వస్తుందన్నారు. కార్యక్రమంలో హరిదాస్‌పల్లి పీఏసీఎస్ సీఈఓ రవి, కేంద్ర నిర్వాహకులు తదితరలు పాల్గొన్నారు.


