జీపీల అభివృద్ధికి సహకరిస్తా
అనంతగిరి: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందించే బాధ్యత సర్పంచ్‌లపై ఉంటుందని స్పీకర్ ప్రసాద్‌కుమార్ అన్నారు. మంగళవారం వికారాబాద్ మండలం కొటాలగూడెం సర్పంచ్ బచ్చంగారి శ్వేత వేమారెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి స్పీకర్ హాజరై మాట్లాడారు. గ్రామ అభివృద్ధికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామన్నారు. ప్రజలకు సేవ చేసే అవకాశం నూతన సర్పంచ్‌లకు వచ్చిందని, దీన్ని అదృష్టంగా భావించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజారంజక పాల న సాగుతోందన్నారు. వికారాబాద్ నియోజకర్గంలో 137 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగితే 105 స్థానాలను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సొంతం చేసుకున్నారని తెలిపారు. మరో 9 మంది రెబల్స్ విజయం సాధించారని చెప్పారు. ఈ విజయానికి సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభు త్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే కారణమన్నారు. అనంతరం నూతన పంచాయతీ పాలకవర్గాన్ని అభినందించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, సోషల్ మీడియా రాష్ట్ర నాయకుడు రఘుపతిరెడ్డి, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు రమేష్‌నాయక్, సీనియర్ నాయకులు అనంత్‌రెడ్డి, శశాంక్‌రెడ్డి, శ్రీనివాస్, మల్లేశం, రాములు నాయక్, వేణుగోపాల్, గురువారెడ్డి, ప్రహ్లాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


