హామీలు నెరవేర్చండి
దోమ: ఎన్నికల సమయంలో ఆశ వర్కర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షురాలు మాధవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఈ మేరకు మండల కేంద్రమైన దోమ మెడికల్ ఆఫీసర్ రజితకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆశ వర్కర్లకు ఎన్నో హామీలు ఇచ్చి నెరవేర్చలేదని మండిపడ్డారు. కనీస వేతనం రూ.18 వేలు చెల్లించాలన్నారు. రూ.50 లక్షల ఇన్సూరెన్స్, మట్టి ఖర్చుల నిమిత్తం రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆదివారం, పండుగ సెలవులు జారీ చేయాలన్నారు. ఏఎన్‌సీ, పీఎన్‌సీ రద్దు చేయాలని కోరారు. రిటైర్డ్‌మెంట్ బెనిఫిట్స్ రూ.5 లక్షలు చెల్లించడంతోపాటు పారితోషికంలో సగం డబ్బును పెన్షన్ రూపంలో ఇవ్వాలన్నారు. ఏటా 20 రోజుల వేతనంతో కూడిన క్యాజువల్ లివ్స్, 6 నెలలు మెడికల్ సెలవులు ప్రకటించాలన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని కాటన్ యూనిఫాం అంద జేయాలని తెలిపారు. పీఆర్‌సీ ఎరియర్స్‌తో పాటు మూడు సంవత్సరాల లెప్రసీ సర్వే డబ్బులు, మూ డు రోజుల పల్స్ పోలియో డబ్బులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. పని ప్రదేశంలో వి శ్రాంతి గది ఏర్పాటు చేసి ఇతరులకు ప్రవేశం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పనిభారం తగ్గించి పారితోషికం లేని పనులను చేయించరాదని కోరా రు. కార్యక్రమంలో మండల ఆశవర్కర్లు అతి యా బేగం, పద్మమ్మ, లక్ష్మి, రమాదేవి, బుడ్డమ్మ, యశో ద, మహేశ్వరీ తదితరులు పాల్గొన్నారు.


