కొత్త సర్పంచ్‌లకు గుర్తింపు కార్డులు
దుద్యాల్: ఇటీవలే ఎన్నికై న నూతన సర్పంచ్‌లకు పంచాయతీ రాజ్ శాఖ నుంచి మంగళవారం గుర్తింపు కార్డులు అందాయి. సోమవారం ప్రమాణ స్వీకారం చేసిన సర్పంచ్‌లకు వెంటనే, ఇంత త్వరగా ఐడెంటిటీ కార్డులు అందడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది. కొండగల్ నియోజకవర్గంలోని కోస్గిలో బుధవారం కొత్త సర్పంచ్‌లతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమావేశం కానున్నారు. వీరితో కలిసి భోజనం చేస్తారు. ఈ నేపథ్యంలోనే సర్పంచ్‌లకు త్వరగా కార్డులు అందించినట్లు తెలుస్తోంది. సర్పంచ్ గుర్తింపు కార్డులు ఉన్న వారికి ప్రత్యేకంగా ఎలాంటి పాసులు అక్కర్లేదని సమాచారం.


