బాల్య వివాహాలు చేస్తే చర్యలు
కుల్కచర్ల: మండల కేంద్రంలో గురువారం బాల్యవివాహం చేస్తున్నారనే సమాచారం అందుకున్న ఐసీడీఎస్ అధికారులు గ్రామానికి చేరుకొని రెండు కుటుంబాలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. బాల్య వివాహాలు చేస్తే చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కుల్కచర్లకు చెందని బాలిక(15)ను దాదాపూర్ గ్రామానికి చెందిన యువకుడికి ఇచ్చి గురువారం వివాహం చేయాలని భావించారు. ఈ విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ అధికారులు స్థానిక పోలీసులతో వారి ఇళ్లకు వెళ్లి పెళ్లి నిలిపివేయాలని సూచించారు. అనంతరం ఐసీడీఎస్ సూపర్‌వైజర్ అంజమ్మ మాట్లాడుతూ.. చిన్న వయస్సులో పెళ్లి చేస్తే బాలిక ఆరోగ్యం దెబ్బతింటుంనది తెలిపారు. బాల్యవివాహాలకు సహకరించినా నేరమని పేర్కొన్నారు.
విద్యుదాఘాతంతో
బాలుడి మృతి
దుద్యాల్: విద్యుదా ఘాతంతో బాలుడు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని కుదరుమల్లలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన కుర్వ నర్సిములు సునీత కుమారుడు భానుప్రసాద్(13). వారికి ఇంటికి దగ్గర్లలోనే పశువుల పాక ఉంది. అక్కడ పశువులను చూడడానికి వెళ్లిన భాను ప్రసాద్ ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడిక్కడే మృతి చెందాడని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపారు. ఈ సంఘటనతో గ్రామంలో విషదచాయలు అలుముకున్నాయి.


