భారీ వర్షం.. అతలాకుతలం
పరిగి: జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో బుధవారం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో రైతులు ఇబ్బందులకు గురయ్యారు. పలు చోట్ల చెరువులు, కుంటల్లో వర్షం నీరు చేరింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి వర్షాలు ముందస్తుగానే కురుస్తున్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద వడ్లు మొలకెత్తుతున్నాయి. మరో రెండుమూడు రోజులు వర్షాలు కురిస్తే రైతులకు చాలా నష్టం వాటిళ్లుతుందని రైతులు వాపోతున్నారు.
మర్పల్లిలో మోస్తరు
మర్పల్లి: మండలంలోని బూచన్‌పల్లి, కొత్లాపూర్, మర్పల్లి, సిరిపురం, కోట్‌మర్పల్లితో పాటు పలు గ్రామాలలో బుధవారం సాయంత్రం ఓ మోస్తరు వర్షం కురిసింది. దీంతో రోడ్లపై నీరు నిలువడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వ్యవసాయ పొలాల్లో నీరు చేరి పనులకు ఆటంకం కలిగిందని రైతులు పేర్కొన్నారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట వర్షం నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
మండలం వర్షపాతం(మి.మీ)
1.వికారాబాద్ 46.3
2.దోమ 43
3.బషీరాబాద్ 40.8
4.పూడూర్ 39.8
5.మోమిన్‌పేట్ 25.8
6.నవాబ్‌పేట్ 22.5
7.యాలాల్ 20.8
8.బొంరాస్‌పేట 20
9.మర్పల్లి 20
10.కోట్‌పల్లి 19.3
11.బంట్వారం 16.5
12.పెద్దేముల్ 15.5
13.కొడంగల్ 14.5
14.చౌడాపూర్ 13.5
15.కుల్కచర్ల 12.5
16.తాండూర్ 12.3
17.ధారూర్ 11
18.దౌల్తాబాద్ 8
19.పరిగి 5.5
జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వానలు
రైతులకు తప్పని తిప్పలు


