Sakshi News home page

ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు ఆధునికం.. రక్షణ అధమం

Published Wed, Jun 21 2023 3:30 AM

పగిడియాల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన రూ.3 లక్షల విలువైన ప్యానెల్‌ బోర్డు  - Sakshi

యాలాల: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆధుని క,మెరుగైన బోధన అందించాలనే లక్ష్యంతో ప్రభు త్వం అందజేసిన సామగ్రి రక్షణ.. గాలిలో దీపంలా మారింది. డిజిటల్‌ క్లాసుల నిర్వహణ కోసం ఒక్కో పాఠశాలకు రూ.లక్షల విలువ చేసే ఎలక్ట్రానిక్‌ పరికరాలను పంపిణీ చేసింది. కానీ వీటి భద్రతపై ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

‘మన బడి’లో అభివృద్ధి పనులు
మన ఊరు– మన బడి కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని ఆరు ఉన్నత పాఠశాలలతో పాటు పలు ప్రాథమిక పాఠశాల్లో అభివృద్ధి పనులు చేపట్టారు. వీటిలో పగిడియాల, కోకట్‌, యాలాల, జుంటుపల్లి, అగ్గనూరు, బెన్నూరు పాఠశాలల్లో హైస్కూల్‌ విద్యార్థులకు డిజిటల్‌ క్లాసుల నిర్వాహణకు భారీగా అధునాతన పరికరాలను పంపిణీ చేశారు. వీటిలో ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెల్‌ బోర్డు(ఐఎఫ్‌పీబీ)లు బహిరంగ మార్కెట్‌లో ఒక్కదానికి సుమారు రూ.3 లక్షల పైచిలుకు ధర ఉన్నాయి. ప్యానెల్‌ బోర్డుతో పాటు ఆధునిక వసతుల కలిగిన డ్యుయల్‌ డెస్క్‌ టేబుళ్లు, గ్రీన్‌ బోర్డు, ఎలక్ట్రానిక్‌ ప రికరాలను ఏర్పాటు చేశారు.ఇలా ఒక్కో పాఠశాల కు సుమారు రూ.10లక్షల విలువైన పరికరాలను అందించారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికి వీ టిని భద్రపరిచే విషయంలో ఆందోళన నెలకొంది.

వాచ్‌మెన్‌లను కేటాయించాలి..
మండల పరిఽధిలోని చాలా స్కూళ్లను తక్కువ ఎత్తున్న ప్రహరీలు, విరిగిన గేట్లు వెక్కిరిస్తున్నాయి. భద్రత పరంగా సౌకర్యాలతో పాటు ఒక్క పాఠశాలకు నిరంతర నిఘాకు వాచ్‌మెన్‌ లేడు. మండలంలోని 10 హైస్కూళ్లతో పాటు 50 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలున్నాయి. కాగా ఈ ఏడాది వేసవి సెలవులో నెల రోజుల పాటు మన ఊరు– మన బడి పథకంలో భాగంగా వాచ్‌మన్ల ఏర్పాటుకు నెల వేతనాన్ని ఇచ్చేందుకు అంగీకరించారు. నిరంతరం దీన్ని కొనసాగిస్తే బాగుంటుందని టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Advertisement
Advertisement