breaking news
panel board
-
ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు ఆధునికం.. రక్షణ అధమం
యాలాల: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆధుని క,మెరుగైన బోధన అందించాలనే లక్ష్యంతో ప్రభు త్వం అందజేసిన సామగ్రి రక్షణ.. గాలిలో దీపంలా మారింది. డిజిటల్ క్లాసుల నిర్వహణ కోసం ఒక్కో పాఠశాలకు రూ.లక్షల విలువ చేసే ఎలక్ట్రానిక్ పరికరాలను పంపిణీ చేసింది. కానీ వీటి భద్రతపై ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ‘మన బడి’లో అభివృద్ధి పనులు మన ఊరు– మన బడి కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని ఆరు ఉన్నత పాఠశాలలతో పాటు పలు ప్రాథమిక పాఠశాల్లో అభివృద్ధి పనులు చేపట్టారు. వీటిలో పగిడియాల, కోకట్, యాలాల, జుంటుపల్లి, అగ్గనూరు, బెన్నూరు పాఠశాలల్లో హైస్కూల్ విద్యార్థులకు డిజిటల్ క్లాసుల నిర్వాహణకు భారీగా అధునాతన పరికరాలను పంపిణీ చేశారు. వీటిలో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ బోర్డు(ఐఎఫ్‌పీబీ)లు బహిరంగ మార్కెట్లో ఒక్కదానికి సుమారు రూ.3 లక్షల పైచిలుకు ధర ఉన్నాయి. ప్యానెల్ బోర్డుతో పాటు ఆధునిక వసతుల కలిగిన డ్యుయల్ డెస్క్ టేబుళ్లు, గ్రీన్ బోర్డు, ఎలక్ట్రానిక్ ప రికరాలను ఏర్పాటు చేశారు.ఇలా ఒక్కో పాఠశాల కు సుమారు రూ.10లక్షల విలువైన పరికరాలను అందించారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికి వీ టిని భద్రపరిచే విషయంలో ఆందోళన నెలకొంది. వాచ్మెన్లను కేటాయించాలి.. మండల పరిఽధిలోని చాలా స్కూళ్లను తక్కువ ఎత్తున్న ప్రహరీలు, విరిగిన గేట్లు వెక్కిరిస్తున్నాయి. భద్రత పరంగా సౌకర్యాలతో పాటు ఒక్క పాఠశాలకు నిరంతర నిఘాకు వాచ్మెన్ లేడు. మండలంలోని 10 హైస్కూళ్లతో పాటు 50 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలున్నాయి. కాగా ఈ ఏడాది వేసవి సెలవులో నెల రోజుల పాటు మన ఊరు– మన బడి పథకంలో భాగంగా వాచ్మన్ల ఏర్పాటుకు నెల వేతనాన్ని ఇచ్చేందుకు అంగీకరించారు. నిరంతరం దీన్ని కొనసాగిస్తే బాగుంటుందని టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
శివారు కేంద్రంగా ప్యానల్ బోర్డుల దందా
సాక్షి, సిటీబ్యూరో: ప్యానల్ బోర్డులు విద్యుత్ ఇంజినీర్ల పాలిట కామధేనువులా మారాయి. శివారు ప్రాంతాల్లోని పలు బహుళ అంతస్థుల భవనాలకు సీఈఐజీ అనుమతి లేకుండానే ప్యానల్ బోర్డులు మంజూరు చేస్తున్నారు. ఒక్కో ప్యానల్ బోర్డుకు రూ.లక్షకుపైగా వసూలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ అక్రమాల్లో లైన్మెన్ నుంచి డీఈ వరకు ముడుపులు పుచ్చుకుంటున్నట్లు తెలిసింది. కోర్‌సిటీతో పోలిస్తే ఇటీవల శివారు ప్రాంతాల్లో బహుళ అంతస్థుల నిర్మాణాలు ఊపందుకున్నాయి. రెండు వందల ఫీట్ల ఎత్తున్న నిర్మాణాలకు సీఈఐజీ అనుమతి తప్పని సరి. అయితే చాలా మంది నెలసరి అద్దెలు వస్తాయనే ఆశతో జీ+3 నుంచి జీ+6 సహా పెంట్‌హౌస్ నిర్మిస్తున్నారు. ఇలా ఒక్కో భవనంలో ఆరేడు పోర్షన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో పోర్షన్‌కు ఒక్కో విద్యుత్ మీటర్ ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది. నిజానికి నాలుగు మీటర్లకు మించి అనుమతి లేదు. ఐదో మీటర్ కావాలంటే ప్యానల్ బోర్డు ఏర్పాటు చేసుకోవాలి. దీనికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ సహా సీఈఐజీ అనుమతి తప్పనిసరి. ఇంటి నిర్మాణానికి అనుమతి తీసుకునే సమయంలో జీహెచ్ఎంసీకి సమర్పించిన ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మాణం ఉంటుంది. దీంతో ఆయా భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ పొందడం కష్టమే కాకుండా భారీ ఖర్చుతో కూడిన వ్యవహారం. వినియోగదారుల్లోని ఈ బలహీనతను విద్యుత్ ఇంజినీర్లు ఆసరాగా చేసుకుంటున్నారు. సెక్షన్ పరిధిలోని రోలింగ్ స్టాక్‌ను మాయం చేసి ఈ అక్రమ భవనాలకు సమకూరుస్తున్నారు. ఇలా ప్యానల్ బోర్డులు మాత్రమే కాదు విద్యుత్ మీటర్లు సైతం ఏర్పాటు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓల్డ్బోయిన్పల్లిలో ఏకంగా 130కిపైగా రోలింగ్‌స్టాక్ మీటర్లు మాయం చేసిన ఘటనపై ఫిర్యాదులు అందడటంతో విచారించిన అధికారులు గతంలో అక్కడ లైన్మెన్ సహా ఏఈలను రెండు రోజుల క్రితం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. డిస్కం ఖజానాకు గండి.. సరూర్‌నగర్ డివిజన్ పరిధిలోని హయత్‌నగర్ సెక్షన్లో కొంత మంది ఇంజినీర్లు సంస్థ ఖజానాకు గండి కొడుతున్నారు. సెక్షన్ పరిధిలోని ఓ వినాయక విగ్రహాల తయారీ వినియోగదారుడు 2012లో విద్యుత్ మీటరు తీసుకున్నాడు. నెలకు రూ.2 వేలకుపైగా బిల్లు నమోదవుతోంది. కానీ సంస్థకు మాత్రం రూ.200 చేరుతోంది. ఇలా ఐదేళ్ల నుంచి ఇదే తంతు కొనసాగుతోంది. వినియోగదారుడి నుంచి మీటర్లో రీడింగైన మొత్తం బిల్లు వసూలు చేస్తూ... ఆ తర్వాత ఈఆర్ఓ సెక్షన్‌లోని క్యాషియర్‌కు తెలియకుండా బిల్లును తగ్గిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు మీటర్ బర్న్ సాకుతో ఇప్పటి వరకు ఏకంగా ఆరు మీటర్లు మార్చారంటే క్షేత్రస్థాయి ఇంజినీర్ల అక్రమాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయం బయటికి పొక్కకుండా డివిజన్ ఉన్నతాధికారులు జాగ్రత్త పడుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇక మెహిదీపట్నం వినియోగదారుల సేవా కేంద్రం అక్రమాలకు నిలయంగా మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. కొత్తలైన్లు, లైన్‌షిఫ్టింగ్ వర్క్స్, ట్రాన్స్ఫార్మర్ల మంజూరు విషయంలో భారీగా చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు తెలిసింది. అడిగినంత ఇవ్వకపోతే వాస్తవ ఖర్చుకంటే ఎక్కువ మొత్తంలో ఎస్టిమేషన్ వేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫోకల్ పోస్టులకు డిమాండ్ ఎందుకంటే.. ప్రభుత్వంలో ఏ విభాగంలోనూ అధికారికంగా ఫోకల్, నాన్‌ఫోకల్ అంటూ రెండు రకాల పోస్టులు లేవు. కానీ దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో ఎక్కడా లేని విధంగా ఫోకల్, నాన్‌ఫోకల్ పోస్టులను సృష్టించారు. కొంత కాలం ఫోకల్ పోస్టులో పనిచేసిన వారు.. ఆ తర్వాత నాన్‌ఫోకల్ పోస్టులో పనిచేయాలనే నిబంధన కూడా ఉంది. పెద్దగా పనులు, ఆదాయం లేని కోర్‌సిటీని నాన్ ఫోకల్‌గా, ఎక్కువ కొత్త కనెక్షన్లు, లైన్స్ ఇతర వర్క్స్‌తో పాటు ఆదాయం ఎక్కువగా ఉన్న శివారు ప్రాంతాలను ఫోకల్ పోస్టులుగా పిలుస్తుంటారు. ఫోకల్ల్లో పోస్టింగ్ కోసం ఉన్నతాధికారులకు రూ.లక్షల ముడుపులు ముట్టజెప్పుతుంటారంటే ఆశ్చర్యపోనవసరం లేదు. పోస్టింగ్ కోసం పెట్టిన పెట్టుబడిని తిరిగి సంపాధించుకునేందుకు ప్యానల్ బోర్డులు, కొత్త లైన్ల ఏర్పాటు, కొత్త ట్రాన్స్ఫార్మర్ల కేటాయింపు విషయంలో భారీగా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. కొత్త మీటర్ల ఏర్పాటు విషయంలో లైన్మెన్లు చేతివాటం ప్రదర్శిస్తుంటే, కొత్తలైన్ల ఎస్టిమేషన్ల విషయంలో ఏఈలు, ట్రాన్స్ఫార్మర్ల కేటాయింపు విషయంలో ఏడీఈ, డీఈలు వసూళ్లకు పాల్పడుతుండటం విశేషం. ఇలా ఎవరిస్థాయిని బట్టి వాళ్లు వాళ్ల రేట్లను ఫిక్స్ చేసుకుంటున్నారు. బహుళ అంతస్థులకు ట్రాన్స్ఫార్మర్లు, ప్యానల్‌బోర్డుల కేటాయింపు, రియల్ ఎస్టేట్ వెంచర్లలో కొత్త లైన్లు, మెటీరియల్ సరఫరా విషయంలో భారీ అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ఇవ్వడానికి నిరాకరించిన ప్రైవేటు కాంట్రాక్టర్లపై కేసులు పెడుతూ, వారిని అనేక వి« దాలు వేధింపులకు గురిచే స్తుండటంతోఇటీవలబహిర్గతం చేయడం విశేషం. -
నిలిచిన విద్యుదుత్పత్తి
మాచ్‌ఖండ్‌లో మొరాయిస్తున్న జనరేటర్లు ప్యానెల్ బోర్డులోకి కూలింగ్ వాటర్ ముంచంగిపుట్టు: ఆంధ్ర-ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో కూలింగ్ వాటర్ ప్యానెల్ బోర్డులోకి చేరడంతో పంపు కాలిపోయి బుధవారం విద్యుదుత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. కాలం చెల్లిన జనరేటర్ల వల్లే తరచూ ఇక్కడ ఈ పరిస్థితి నెలకొంటోంది. ఇక్కడి ఆరు జనరేటర్లతో ఒకప్పుడు 120 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యేది. ఐదో నంబర్ జనరేటర్ కొంత కాలంగా మూలకు చేరింది. మిగిలిన ఐదింటితోనే నెట్టుకొస్తున్నారు. ఈ నెల 8న కూలింగ్ వాటర్ పంప్ చెడిపోవడంతో 1,2,4,6 నంబర్ల జనరేటర్లలో ఉత్పతి నిలిచిపోయిన విషయం తెలిసిందే. ప్రాజెక్టు అధికారులు 1,2,నంబరు జనరేటర్లను అదే రోజు వినియోగంలోకి తెచ్చారు. 1,2,3 జనరేటర్లతో 51 మెగావాట్లు ఉత్పత్తి చేసేవారు. మంగళవారం ఆరో నంబర్ జనరేటర్‌నూ బాగు చేశారు. దీంతో ఉత్పత్తి 74 మెగావాట్లకు పెరిగింది. ఈ క్రమంలో కూలింగ్ వాటర్ మరోసారి చేరడంతో బుధవారం ప్యానెల్ బోర్డు కాలిపోయింది. విద్యుదుత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. ప్రాజెక్టు ఎస్ఈ ఎం.గౌరీపతి వద్ద ఇదే విషయాన్ని ప్రస్తావించగా కూలింగ్ పంప్ చేడిపోవడంతో ఉత్పతి నిలిచిపోయిందన్నారు.