పోలేరమ్మా.. | - | Sakshi
Sakshi News home page

పోలేరమ్మా..

Oct 2 2026 7:32 AM | Updated on Oct 2 2026 7:32 AM

జై పోలేరు.. జైజై పోలేరు..! పోలేరు తల్లీ కరుణించి కాపాడు తల్లీ..! అంటూ భక్తులు ఆధ్యాత్మిక చింతనలో మునిగితేలారు. వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మను దర్శించి తన్మయత్వం పొందారు. తల్లి దీవెనల కోసం బారులు తీరారు. గంటల తరబడి క్యూల్లో వేచి ఉండి మరీ అమ్మవారిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. లక్షల మంది భక్తులు తరలిరావడంతో వెంకటగిరి కిక్కిరిసిపోయింది. పోలేరమ్మ నామస్మరణతో మార్మోగింది. నగరోత్సవంలో బాణసంచా ఆకట్టుకుంది. సామాన్య భక్తులు క్యూల్లో నలిగిపోగా.. కూటమి నేతల సిఫార్సులకే అధికారులు ప్రాధాన్యతనివ్వడం విమర్శలకు తావిచ్చింది.

నగరోత్సాహం

అమ్మవారికి సంప్రదాయ బద్ధంగా దున్నపోతును బలిచ్చారు. ఆ తర్వాత గ్రామ పొలిమేర వద్ద పొలి కార్యక్రమం చేపట్టారు. తదనంతరం ప్రత్యేకంగా అలంకరించిన పూల రఽథంపై పోలేరమ్మ తల్లి ఆశీనులై నగరోత్సవానికి బయల్దేరారు. అమ్మవారి ఆలయ మండపం నుంచి ప్రారంభమైన పోలేరమ్మ నగరోత్సవం రాజావీధి, కాశీపేట సెంటర్‌, పాత శివాలయంవీధి మీదుగా మల్లమ్మగడి ప్రాంతం, అమ్మవారి నిష్కమణ మండపం వరకు సాగింది. ఈ ఏడాది ఊరేగింపు నిదానంగా సాగడంతో భక్తులు అమ్మవారిని తనివి తీరా దర్శించుకున్నారు.

పట్టు వస్త్రాల సమర్పణ

జాతర సందర్భంగా దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ ఈఓ శ్రీనివాసులురెడ్డి పర్యవేక్షణలో ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement